ఈ టెకీలకు రోబోల ముప్పు లేదు..

27 Nov, 2017 16:09 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్‌తో ఉద్యోగాలకు ఎసరు వస్తుంటే తాజాగా 21 జాబ్‌లకు రోబోల నుంచి మరో పదేళ్ల వరకూ ఎలాంటి ముప్పూ ఉండదని ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఓ నివేదికలో వెల్లడించింది.పరిశ్రమ ట్రెండ్స్,వాస్తవాలను ఆకళింపు చేసుకుని ఈ నివేదిక రూపొందించినట్టు కంపెనీ పేర్కొంది.

రోబో ఫ్రూఫ్‌ జాబ్‌లుగా ఇవి భవిష్యత్‌ను నిర్ధేశిస్తాయని తెలిపింది. ఈ సూపర్‌ జాబ్స్‌లో క్వాంటమ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ ఎనలిస్ట్‌, అగ్‌మెంటెడ్‌ రియాల్టీ జర్నీ బిల్డర్‌,మాస్టర్‌ ఆఫ్‌ ఎడ్జ్‌ కంప్యూటింగ్‌,జెనెటిక్‌ డైవర్సిటీ ఆఫీసర్‌, ఏఐ-అసిస్టెడ్‌ హెల్త్‌కేర్‌ టెక్నీషియన్‌,సైబర్‌ సిటీ అనలిస్ట్‌,డేటా డిటెక్టివ్‌, పర్సనల్‌ డేటా బ్రోకర్‌, ఐటీ ఫెసిలిటేటర్‌,మ్యాన్‌-మెషీన్‌ టీమింగ్‌ మేనేజర్‌,బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌,డిజిటల్‌ టైలర్‌,వర్చువల్‌ స్టోర్‌ షెర్పా,ఫిట్‌నెస్‌ కమిట్‌మెంట్‌ కౌన్సెలర్‌,పర్సనల్‌ మెమరీ క్యూరేటర్‌,చీఫ్‌ ట్రస్ట్‌ ఆఫీసర్‌,ఫైనాన్షియల్‌ వెల్‌నెస్‌ కోచ్‌,జీనోమిక్‌ పోర్ట్‌పోలియో డైరెక్టర్‌,ఎథికల్‌ సోర్సింగ్‌ మేనేజర్‌,హైవే కంట్రోలర్ వంటి ఉద్యోగాలున్నాయి.

మరిన్ని వార్తలు