చిన్న పట్టణాలకూ థామస్ కుక్..

7 May, 2016 00:57 IST|Sakshi
చిన్న పట్టణాలకూ థామస్ కుక్..

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రావెల్ సేవల రంగంలో ఉన్న థామస్ కుక్ చిన్న పట్టణాలకూ విస్తరిస్తోంది. బుకింగ్స్ కోసం నగరాలకు వచ్చే అవసరం లేకుండా కస్టమర్ల వద్దకే సేవలను తీసుకెళ్తామని సంస్థ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు శుక్రవారమిక్కడ తెలిపారు. ‘ప్రస్తుతం 110 నగరాలు, పట్టణాల్లో సేవలందిస్తున్నాం. వీటిలో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు 70 శాతముంటాయి.

118 ఫ్రాంచైజీలు, 64 సొంత ఔట్‌లెట్లు, 500 మంది ఏజెంట్లతో వినియోగదార్లకు చేరువయ్యాం. వ్యాపార అవకాశాలున్న మరిన్ని కొత్త పట్టణాలకు చేరుకుంటాం. మెట్రోల్లో అయితే 3 కిలోమీటర్లకు ఒక టచ్ పాయింట్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం వ్యాపారంలో మెట్రో నగరాల వాటా ఏకంగా 65 శాతముంది’ అని తెలిపారు. ఈవెంట్స్ విభాగంలోకి ఏడాదిలో ప్రవేశిస్తామన్నారు. విదేశాల్లో శుభకార్యాలు జరుపుకునే వారికి పూర్తి స్థాయి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. థామస్ కుక్ ద్వారా ఏడాదికి 50 వేల పైచిలుకు మంది విదేశాల్లో జరిగే సమావేశాల కోసం వెళ్తున్నారని వివరించారు.

మరిన్ని వార్తలు