విజయకాంత్‌ ఆరోగ్యంపై ప్రకటన చేసిన నాజర్‌

2 Dec, 2023 19:50 IST|Sakshi

జలుబు, దగ్గు, గొంతునొప్పితో డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ చికిత్స పొందుతున్నారు. నవంబర్‌ 18న చెన్నైలోని మయత్‌ ఆస్పత్రిలో ఆయన చేరారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారని, చికిత్సకు బాగా సహకరిస్తున్నారని నవంబర్ 23న మయత్ ఆసుపత్రి యంత్రాంగం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ కొన్ని రోజుల తర్వాత, అకస్మాత్తుగా మరోక ప్రకటన విడుదల చేసి అతని పరిస్థితి గత 24 గంటల నుంచి నిలకడగా లేదు అంటూనే పల్మనరీ చికిత్స అవసరం ఉందని తెలిపి విజయకాంత్‌ త్వరగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని చెప్పింది. ఆయనకు మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అందించాల్సి ఉందని తెలిపింది.

దీంతో ఆయన అభిమానులు, డీఎండీకే కార్యకర్తలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. విజయకాంత్ ఆరోగ్యంపై ప్రేమలత విడుదల చేసిన వీడియోలో.. 'కెప్టెన్ ఆరోగ్యంపై ఆసుపత్రి యాజమాన్యం రెగ్యులర్‌గా నివేదిక ఇస్తుంది. ఆయన ఆరోగ్యంపై భయపడాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌ ఆరోగ్యంగానే ఉన్నారు. వైద్యులు, నర్సులు, నేను అతనిని బాగా చూసుకుంటున్నాం.' అని తెలిపింది. త్వరలోనే ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చి  అందరినీ కలుస్తారని ఆమె తెలిపారు.

ఆమె ప్రకటనతో అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి. విజయకాంత్‌ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు  ఆర్‌కే సెల్వమణి, నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్‌, నిర్మాత శివ ఆస్పత్రికి వెళ్లారు. విజయకాంత్ ఆరోగ్యం గురించి వైద్యుల ద్వారా పలు విషయాలను తెలుసుకున్నారు. 

అనంతరం నడిఘర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. 'కెప్టెన్ విజయకాంత్ ఆరోగ్యంగానే ఉన్నారు.. ఆయనపై వస్తున్న వార్తలు నమ్మెద్దు. విజయకాంత్ త్వరలో  అభిమానులను కలుస్తారు. అతను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ ICU వార్డులో అతను ఉన్నందున మేము చూడలేకపోయాం. కానీ విజయకాంత్ ఆరోగ్యంపై తమకు వైద్యులు సమాచారం అందించారు. వైద్య భద్రత దృష్ట్యా ఆయన్ను చూసేందుకు అనుమతించలేదు.' అని తెలిపారు. దీంతో ఆయన అభిమానులకు కాస్త ఊరట కలిగింది.. అయితే గత రెండు రోజులుగా విజయకాంత్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వ్యాపించాయి.

మరిన్ని వార్తలు