Sakshi News home page

HCL: ఆస్తులు అమ్మేయడానికి సిద్దమైన హెచ్‌సీఎల్.. ఎందుకంటే?

Published Sat, Dec 2 2023 4:11 PM

HCL Tech To Sell Bengaluru Office Assets - Sakshi

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన 'హెచ్‌సీఎల్ టెక్నాలజీ' (HCL Technology) బెంగళూరులోని తన కార్యాలయం ఆస్తులను విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

హెచ్‌సీఎల్ కంపెనీ, బెంగళూరు జిగానీ పారిశ్రామిక ప్రాంతంలోని సుమారు 27 ఎకరాల స్పెషల్ ఎకనామిక్ జోన్ క్యాంపస్ విక్రయించాలని చూస్తోంది. ఈ ప్రాపర్టీ విలువ సుమారు రూ. 550 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

అనవసర ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే హెచ్‌సీఎల్ తన ఆస్తులను విక్రయించాలనుకుంటున్నట్లు కొందరు చెబుతున్నారు. నాన్ కోర్ రియల్ ఎస్టేట్ అసెట్స్ మానిటైజే చేసేందుకు, కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: వేగానికి చెక్ పెట్టే గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే?

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ రోషిణీ నాడార్, కంపెనీని వేగంగా అభివృద్ధి చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త రంగాల్లో అడుగుపెట్టడానికి కూడా యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఏకంగా 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement