35 శాతం తగ్గిన వేదాంత నికర లాభం

30 Jul, 2015 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ : అంతర్జాతీయ దిగ్గజం ‘వేదాంత’ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 35 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.1,341 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.866 కోట్లకు తగ్గిందని లండన్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన వేదాంత రిసోర్సెస్‌కు చెందిన వేదాంత (ఇంతకుముందు సెసా స్టెరిలైట్) తెలిపింది. నికర అమ్మకాలు రూ.17,056 కోట్ల నుంచి రూ.16,952 కోట్లకు తగ్గాయని వేదాంత సీఈఓ టామ్ అల్బనీజ్ పేర్కొన్నారు.

కమోడిటీ ధరలు ఒడిదుడుకులమయంగా ఉండడం, మార్కెట్ పరిస్థితులు సమస్యాత్మకంగా ఉండడం, ఇతరత్రా కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని వివరించారు. కష్టకాలం మరికొంత కాలం కొనసాగుతుందని చెప్పారు. బుధవారం ఈ కంపెనీ షేరు ధర 2% పెరిగి రూ.131 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు