'తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్': నాని కామెంట్స్ వైరల్!

20 Nov, 2023 19:21 IST|Sakshi

దసరాతో హిట్ కొట్టిన నేచురల్ స్టార్ నాని మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. దసరాలో మాస్ యాక్షన్‌లో అలరించిన.. ఈసారి మాత్రం హాయ్ నాన్న అంటూ తండ్రి, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీతో రానున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే మూవీ ప్రమోషన్స్‌తో నాని బిజీ అయిపోయారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి ఉండడంతో విభిన్నమైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన నాని.. తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

ప్రెస్ మీట్‌లో రాహుల్ మాట్లాడుతూ.. 'మన రాహుల్ వచ్చిండా. నువ్వు చాలా గమ్మత్తుగా ఉన్నావయ్యా. ఇక్కడ నార్త్, సౌత్ సినిమా అని ఉండదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ కాదని నేను అనలే. మన సినిమాను పోస్ట్ పోన్ కానివ్వం. ఏమయ్యా రాహుల్ ప్రీ పోన్‌కు, పోస్ట్ పోన్‌కు ఆ మాత్రం తేడా తెల్వదా నీకు. సినిమా బాగుండే అడుతది. లేకుంటే పీకుతది. డిసెంబర్‌ 7న థియేటర్లో దావత్ చేసుకోవాలే. తమ్ముడు నువ్వు ఏదో కిరి కిరి పెట్టాలని చూస్తున్నావ్. అదే జరగదు. అనుకున్న టైంకే సినిమా రిలీజ్ అయితది.' నవ్వులు పూయించారు. హాయ్ నాన్న పార్టీ ప్రెస్ మీట్ అంటూ తెలంగాణం సీఎం కేసీఆర్ స్టైల్లో స్పీచ్ అదరగొట్టేశారు నాని. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తలు