రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్‌లు అమ్మకం

12 Oct, 2018 19:41 IST|Sakshi

చైనా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్‌ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్‌లను విక్రయించింది. ఈ డివైజ్‌ల్లో ఎంఐ ఎల్‌ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్‌ 3, ఎంఐ పవర్‌ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్‌ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్‌ డివైజ్‌లు, యాక్ససరీ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌, ఎంఐ సూపర్‌ సేల్‌ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్‌ చేసింది. ఫెస్టివల్‌ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్‌లో అమేజింగ్‌ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్‌ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, గ్లోబల్‌ వీపీ మను కుమార్‌ జైన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్‌ జైన్‌ కృతజ్ఞతలు తెలిపారు.  

ఫెస్టివల్‌ సేల్స్‌లో భాగంగా షావోమి ప్రొడక్ట్‌లపై అందిస్తున్న ఆఫర్లు....

  • రెడ్‌మి నోట్‌ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్‌లో లభ్యమవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్‌ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది.
  • రెడ్‌మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్‌, రెడ్‌మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్‌ ఫోన్‌ రూ.1000, రూ.2000 డిస్కౌంట్‌లో విక్రయానికి వచ్చింది. 
  • ఎంఐ మిక్స్‌ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది.  
  • ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్‌ అనంతరం ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 
  • 10000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి.
  • 20000 ఎంఏహెచ్‌ పవర్‌ బ్యాంక్‌ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా