ఆధార్ లింక్ చేయపోతే, అన్ని అకౌంట్స్ బ్లాక్!

12 Apr, 2017 15:22 IST|Sakshi
ఆధార్ లింక్ చేయపోతే, అన్ని అకౌంట్స్ బ్లాక్!
న్యూఢిల్లీ : ఆధార్ విషయంపై బ్యాంకు, ఫైనాన్సియల్ అకౌంట్ హోల్డర్స్ కు  ఆదాయపు పన్ను శాఖ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేసింది. 2014 జూలై 1 నుంచి 2015 ఆగస్టు 31 మధ్యలో బ్యాంకు అకౌంట్లు, ఇన్సూరెన్స్, స్టాక్ వంటి ఇతర అకౌంట్లు ప్రారంభించినవారు ఏప్రిల్ 30లోగా ఆధార్ ను తమ అకౌంట్లకు లింక్ చేసుకోవాలని సూచించింది. గడువులోగా అకౌంట్ హోల్డర్స్ వివరాలను అందించకపోతే, అకౌంట్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. బ్యాంకులకు, ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు ఆ అకౌంట్లను బ్లాక్ చేసే అధికారముంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒక్కసారి వివరాలన్ని సమర్పించిన అనంతరం ఎప్పటిలాగే అకౌంట్లను ఆపరేట్ చేసుకోవచ్చని పేర్కొంది.
 
ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లియెన్స్ యాక్ట్( ఎఫ్‌ఏటీసీఏ) ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ అందరూ తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలని ఐటీ శాఖ ఆదేశించింది. ఎఫ్‌ఏటీసీఏ చట్టం కింద అమెరికా, భారత్ రెండు దేశాలు పన్నులకు సంబంధించిన సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి వీలుంటుంది.  పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆర్థిక సమాచారం పంచుకునేలా ఈ రెండు దేశాలు 2015 జూలైలో ఈ అగ్రిమెంట్ ను కుదుర్చుకున్నాయి.  ''2017 ఏప్రిల్ 30 వరకు సెల్ఫీ సర్టిఫికేషన్ సమర్పించండి. లేకపోతే అకౌంట్లు బ్లాక్ చేస్తాం. అకౌంట్ల బ్లాక్ చేస్తే, ఇక  అకౌంట్ హోల్డర్ ఎలాంటి లావాదేవీలను జరుపుకోవడానికి వీలుండదు'' అని ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అకౌంట్లలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, స్టాక్స్ అన్ని కలిసే ఉంటాయని తెలిపింది. ఈ ఎఫ్‌ఏటీసీఏ ప్రొవిజన్స్ కిందకు వచ్చే అకౌంట్ హోల్డర్స్ గడువులోగా ఆధార్ నెంబరు సమర్పించాల్సిందేనని పేర్కొంది.
 
మరిన్ని వార్తలు