99 శాతం గుడుంబా నిర్మూలించాం

6 Feb, 2018 02:51 IST|Sakshi

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు 

ఖమ్మం క్రైం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 99 శాతం గుడుంబా విక్రయాలు జరగడంలేదని, ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రమే గుడుంబా అమ్ముతున్నట్లు తెలుస్తోందని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌రావు తెలిపారు. సోమవారం ‘సాక్షి’మెయిన్‌లో ‘నాటుసారాకు కొత్తరెక్కలు’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సువిజ్ఞానపురం ప్రాంతంలో చక్కెరతో గుడుంబా తయారు చేస్తున్నారని, దీంతో పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెళ్లి వారిని అరెస్టు చేయడంతోపాటు పదిమంది చక్కెర వ్యాపారులపై కేసు నమోదు చేసి.. బస్తాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.

గుడుంబా పునరావాసం కింద ఉమ్మడి జిల్లాలో 732 మందిని ఎంపికచేసి, వారికి రూ. 2 లక్షల చొప్పన రుణాలిచ్చామన్నారు. వారు మళ్లీ గుడుంబా విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే రుణాన్ని రద్దు చేయడంతోపాటు  బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. చక్కె ర రూపంలో గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే వాటిపై కూడా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏపీ నుంచి చక్కెర తరలించే ప్రాం తాలపై  నిఘాపెట్టామని, నాటుసారాను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు