ఏసీబీ వలలో అవినీతి చేప

13 Oct, 2018 12:26 IST|Sakshi
డీటీ కిరణ్‌కుమార్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు  ఏసీబీ అధికారులు స్వాధీనం  చేసుకున్న డబ్బులు

చిట్యాల(భూపాలపల్లి): ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో రెండేళ్లలో తహసీల్దార్‌ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్‌ ఏసీబీ అధికారులకు పట్టుపడగా, శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్‌ రామగిరి కిరణ్‌కుమార్‌ రూ.5వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం... చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన రేషన్‌ డీలర్‌ ముకిరాల శ్యామలకు పభుత్వం నుంచి రూ.40 వేల కమీషన్‌ విడుదలైంది. శ్యామలను అత్తగారింటి వద్ద విజయలక్ష్మి అని పిలుస్తుంటారు.

ఈమేరకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు విజయలక్ష్మి పేరుమీదే ఉన్నాయి. ఆమె పేర కమీషన్‌ డబ్బు మంజూరు కాగా కుమారుడు మధువంశీకృష్ణ 45 రోజుల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌ను సంప్రదించి శ్యామలగా ధ్రువీకరించి చెక్కు ఇవ్వాలని కోరాడు. ఇందుకు డీటీ రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. తమ వద్ద డబ్బులు లేవని వేడుకున్నా వినలేదు. దీంతో రూ.5వేలు ఇస్తానని చెప్పి గత నెల 28న ఏసీబీ కార్యాలయంలో సంప్రదించాడు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి డీటీ కిరణ్‌కుమార్‌పై ఈనెల 1 నుంచి 4 వరకు నిఘా పెట్టారు. శుక్రవారం ఆఫీస్‌లో మధువంశీకృష్ణ నుంచి డీటీ రూ.5వేల నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రికార్డులు సోదా చేశారు. డీటీని అరెస్ట్‌ చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్డులో హాజరుపరచనున్నారు. ఏసీబీ సీఐలు సతీష్‌కుమార్, క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

డీటీపై అవినీతి ఆరోపణలు
చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో 2014లో డిప్యూటీ తహసీల్దార్‌గా కిరణ్‌కుమార్‌ విధుల్లో చేరాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జిల్లా అధికారులు పలుమార్లు హెచ్చరించారు. 2016లో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడగా సహచర ఉద్యోగులు, అధికారులు చందాలుగా ఇచ్చిన రూ.3లక్షల డబ్బులను డీటీ దగ్గర పెట్టుకోవడంతో స్థానిక అధికారులు గొడవ పడి మృతుడి కుటుంబ సభ్యులకు ఇప్పించారు. డీలర్లు కొందరు తమను వేధిస్తున్నాడని డీటీపై ఫిర్యాదు చేశారు. ఇటీవల మంగపేట తహసీల్దార్‌గా వెళ్లాలని జిల్లా అధికారులు ఆదేశించినా పోలేదని స్థానిక అధికారులు తెలిపారు.

ఇప్పటివరకు నలుగురు
చిట్యాల తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు ఇష్టారాజ్యాంగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కడ పరిపాటిగా మారింది. 2013లో అప్పటి తహసీల్దార్‌ లింగాల సూరి బాబు రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 2016 సెప్టెంబర్‌ 19న తహసీల్దార్‌ పాల్‌సింగ్, వీఆర్వో రవీందర్‌ రైతు వద్ద రూ.10 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. డీటీగా కిరణ్‌కుమార్‌ శుక్రవారం రూ.5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. అయినా సహచర అధికారుల్లో మార్పు రాకపోవడంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తృణమూల్‌ కార్యకర్త దారుణ హత్య..!

అమ్మతనం ఆవిరైంది.. నాలుగో అంతస్తు పైనుంచి..

కుటుంబంతో సహా బీజేపీ నాయకుడి దారుణ హత్య

కేపీహెచ్‌బీలో బ్యూటీషియన్‌ ఆత్మహత్య

సినిమాను తలదన్నే.. లవ్‌ క్రైం స్టోరీ..!

భర్త హత్యకు భార్య స్కెచ్‌, 10 లక్షల సుపారీ

దారుణం: కుక్కల బారి నుంచి తప్పించుకోబోయి

బిర్యానీలో చచ్చిన బల్లులను కలుపుతూ....

ఆడి కారు కోసం... ఇంట్లోనే డబ్బులు ప్రింట్‌ చేసి..

బంధువులను పరిచయం చేస్తానని చెప్పి..

ఆస్పత్రిలో పరిచయం: ఆపై తరచూ ఫోన్లో..

మృత్యు పంజా

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

ప్రేమ పేరుతో వంచించాడు..

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

బినామీ బాగోతం..!

అవహేళన చేస్తావా.. అంటూ కత్తితో..

ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే

కరెంటు లేదా అంటూ వచ్చి.. కిడ్నాప్‌

చెల్లెలిపై అన్న లైంగికదాడి 

తెల్లారేసరికి విగతజీవులుగా..

వసూల్‌ రాజా.!

ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...

దండుపాళ్యం ముఠా కన్నుపడితే అంతే..

ఇల్లు ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు 

యువకుడి దారుణ హత్య

బాత్‌రూమ్‌లో కిందపడి విద్యార్థిని మృతి

మోసం.. వస్త్ర రూపం

ఫేస్‌బుక్‌ ప్రేమ విషాదాంతం

రోడ్డు బాగుంటే పాప ప్రాణాలు దక్కేవి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌