పెరకలపాడు సహకార సంఘంలో ఏసీబీ తనిఖీలు

29 Feb, 2020 14:04 IST|Sakshi

సాక్షి, నందిగామ: మాజీ మంత్రి దేవినేని ఉమా బంధువు గద్దె వీరభద్రరావుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కంచికచర్ల మండలం పెరకలపాడు సహకార సంఘం భవనంలో శనివారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పొట్లూరి అరుణ అనే మహిళ ఫిర్యాదు మేరకు రికార్డులను తనిఖీలు చేస్తున్నారు. తన పేరు మీద గద్దె వీరభద్రరావు లోన్‌ తీసుకున్నారని సదరు మహిళ ఆరోపిస్తున్నారు. సహకార పరపతి సంఘంలో తాను లోను తీసుకోకపోయినప్పటికీ తీసుకున్నట్లుగా తన పేరును ఉపయోగించి బినామీ రుణాలు పొందారని అరుణ ఫిర్యాదు చేశారు. పూర్వపు పాలకవర్గం, ప్రస్తుత కార్యదర్శులు తన పేరును ఉపయోగించే బినామీ రుణాలు పొందారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెరకలపాడు సహకారం సంఘంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

 

మరిన్ని వార్తలు