తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

8 Nov, 2023 10:26 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణతో సహా దేశంలో 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా కేసులో ఎన్‌ఐఏ ఈ మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

 తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్,  హర్యానా, రాజస్థాన్, జమ్ము కాశ్మీర్‌లో సోదాలు జరుగుతున్నాయి. 

మరోవైపు టెర్రర్ ఫండింగ్ కేసులో జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. అనంతనాగ్‌, పుల్వామా జిల్లాలతో సహా దక్షిణ కశ్మీర్‌లో ఎస్‌ఐఏ అధికారులు దాడులు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు