నటుడు శరవణకుమార్‌ కిడ్నాప్‌

16 Feb, 2019 08:51 IST|Sakshi

పోలీసుల అదుపులో కిడ్నాపర్లు 

పెరంబూరు: నటుడు శరవణకుమార్‌ అలియాస్‌ అభిశరవణన్‌ కిడ్నాప్‌నకు గురైన సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. ఈయన ఆళ్వార్‌తిరునగర్, కామరాజ్‌ వీధిలో నివశిస్తున్నారు. గురువారం రాత్రి అభిశరవణన్‌ను ముగ్గురు వ్యక్తులు కారులో కిడ్నాప్‌ చేశారు. దీనిపై ఆయన డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు కిడ్నాపర్లను అరెస్ట్‌ చేశారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాల్లోకెళ్లితే.. 

అభిశరవణన్‌ పట్టాదారి తదితర చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. అదే చిత్రంలో కథానాయకిగా నటించిన అతిథిమీనన్‌తో పరిచయం ప్రేమగా మారింది. 2015లో మధురైలో ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. సినిమా అవకాశాలు లేని నటి అతిథిమీనన్‌ అజిత్‌ అనే సినీ బ్రోకర్‌తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం అభిశరవణన్‌కు తెలియడంతో అతిథిమీనన్‌ను మందలించారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం పెద్దదవడంతో గత ఆరు నెలల క్రితం విడిపోయారు. ఈ పరిస్థితుల్లో అభిశరవణన్‌ రెండు రోజుల క్రితం అజిత్, స్థానిక ఆల్పాకంకు చెందిన దర్శిన్‌లపై వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా గురువారం రాత్రి చాయాగ్రహకుడు దర్శన్‌ నటుడు అభిశరవణన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడుకుందాం మని చెప్పాడు. దీంతో అభిశరవణన్‌ ఇంటి నుంచి బయటకు రావడంతో అప్పటికే కారుతో రెడీగా ఉన్న అజిత్, దర్శన్, నవీన్‌ అభిశరవణన్‌ను వేగంగా కారులో కిడ్నాప్‌ చేశారు. ఇది గమనించిన అభిశరవణన్‌ కారు డ్రైవర్‌ వలసవాక్కం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అభిశరవణన్‌ కోసం నగరం అంతా గాలింపు చర్యలు చేపట్టారు. 

కిడ్నాప్‌ విషయం తెలిసిందిలా..
ఇదిలా ఉండగా అభిశరవణన్‌ను కిడ్నాప్‌ చేసిన ముగ్గురిలో దర్శన్‌కు శ్వాస సంబంధిత సమస్య ఏర్పడింది. దీంతో వారు తిరిగి వలసరవాక్కంకు శుక్రవారం వేకువజామున చేరుకుని దర్శన్‌ను సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని అభిశరవణన్‌ పోలీసులకు ఫోన్‌ చేసి తెలిపాడు. దీంతో అక్కడికి వచ్చిన ప్రత్యేక ఎస్‌ఐ ఏకాంబరం, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటాచలం కారులో ఉన్న నటుడు అభిశరవణన్‌ను విడిపించారు. కిడ్నాపర్లను అరెస్ట్‌ చేసి పోలీస్‌సేష్టన్‌కు తీసుకువచ్చారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో నటి అతిథిమీనన్‌ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు