నటి సహాయకురాలు ఆత్మహత్యాయత్నం

12 Mar, 2020 08:28 IST|Sakshi

పెరంబూరు: ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో సినీ నటి సహయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక విరుగంబాక్కంలో దివంగత సినీ దర్శకుడు బాలుమహేంద్ర ఇల్లు ఉంది. ఆయన భార్య, నటి మోనిక నివసిస్తున్నారు. ఆమె వద్ద సిగాలంకారిణిగా జ్యోతిక(22) పనిచేస్తోంది. ఈమె నటి మోనిక కారు డ్రవర్‌ కార్తీక్‌ని ప్రేమించింది. గత నెలలో కారు డ్రైవర్‌ అక్కడ పనిమానేశాడు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పును గమనించిన జ్యోతిక తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. ఆమెను పెళ్లి చేసుకోవడానికి కార్తీక్‌ నిరాకరించాడు. మంగళవారం రాత్రి జ్యోతిక బ్లేడుతో చేతిని, మెడను కోసుకుని ఆత్మహత్మాయత్నానికి పాల్పడింది. ఆక్కడ ఉన్నవారు ఆమెను వెంటనే స్థానిక సాలి గ్రామంలోని ఒక ప్రైవేట్‌ అస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు జ్యోతికకు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన విరుగంబాక్కంలో కలకలం రేపింది.

మరిన్ని వార్తలు