గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట మోసం

8 Aug, 2019 11:17 IST|Sakshi

సాక్షి, గుంటూరు : గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ పేరిట వ్యక్తి నుంచి నగదు కాజేసిన ఘటనపై కేసు నమోదయ్యింది. పట్టణ చెంచుపేటకు చెందిన కె. శ్రీనివాస్‌ గూగుల్‌ పే ద్వారా రూ.4,230 బిల్లును మంగళవారం రాత్రి చెల్లించాడు. బ్యాంకు ఖాతాలో నగదు డిడక్ట్‌ అయినా, ట్రాన్సాక్షన్‌ ఫెయిల్‌ అని రావడంతో బుధవారం ఉదయం గూగుల్‌ పే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాడు. ఫోన్‌కు సమాధానం రాలేదు. కొద్దిసేపటికే 8144185193 నంబర్‌ నుంచి శ్రీనివాస్‌కు ఫోన్‌ వచ్చింది. తాను గూగుల్‌పే కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పాడు. తన ఐడీ నంబర్‌ అంటూ ఒక నంబర్‌ తెలిపాడు.

ఖాతాలో డిడక్ట్‌ అయిన నిధులను తిరిగి జమ చేసేందుకు, తమ నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌ను మరో నంబరుకు ఫార్వార్డ్‌ చేయమని చెప్పడంతో శ్రీనివాస్‌ అలాగే చేశాడు. కొద్ది సేపటికే ఐదు విడతల్లో తన బ్యాంకు ఖాతాలోని రూ.99,995 నగదు మాయమయ్యిందని, బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్‌ తీసుకుని అక్కడి అధికారులను సంప్రదించగా  తాము ఏమీ చేయలేమని చెప్పినట్లు శ్రీనివాసు తెలిపాడు. దీంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించాడు.

  

మరిన్ని వార్తలు