పెళ్లింట్లో విషాదం..‘మల్లన్న’కు దగ్గరకు వెళుతూ..

23 Oct, 2019 08:42 IST|Sakshi
ముఖేష్‌ (ఫైల్‌) పెంటప్ప (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

‘మల్లన్న’కు తొలి పత్రికను అందించేందుకు కొమురవెల్లి వెళ్తుండగా దుర్ఘటన

చంపాపేట/శామీర్‌పేట: పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ తొలి ఆహ్వాన పత్రికను మల్లన్న సన్నిధిలో ఉంచి పూజలుచేయించేందుకు కొమురవెల్లి వెళ్తున్న తండ్రీ కొడుకులు బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు... చంపాపేట డివిజన్‌ రెడ్డి బస్తీ కాలనీకి చెందిన ధన్ని పెంటప్ప (58)భవన నిర్మాణ కార్మికుడు. ఆయనకు ఇద్దరు కుమారులు. చిన్న కొడుకు ముఖేష్‌ (29) ఎంబీఏ పూర్తి చేసి రామంతాపూర్‌లోనిఓ సంస్థలో పని చేస్తున్నాడు.

ఇటీవల అతడికి పెళ్లి కుదిరింది. నవంబర్‌ 10న పెళ్లి జరగాల్సి ఉంది. మొదటి ఆహ్వాన పత్రికను కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో ఉంచి పూజలు చేయడం వారి కుటుంబ ఆచారం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం తండ్రీకొడుకులు కొమురవెల్లి బయలుదేరారు. శామీర్‌పేట పరిధిలోని తుర్కపల్లి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదంలో పెంటప్ప, ముఖేష్‌ మృతి చెందిన విషయం తెలియడంతో బంధువులు, స్నేహితులు చంపాపేటలోని వారి ఇంటికి తరలి వచ్చారు. ముఖేష్‌ పెళ్లికి హాజరు కావాలనుకున్న తాము ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదని విలపించారు. స్థానిక కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి, డివిజన్‌ నాయకులు కుటుంబసభ్యులను పరామర్శించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. భార్య చేతిలో

వాట్సాప్‌లో సర్పంచ్‌ పేరు పెట్టలేదని..

దారుణం: 8 ఏళ్ల బాలికపై బంధువు అత్యాచారం

ప్రాణం తీసిన 'తబ్లిగి జమాత్‌' వివాదం

హత్య వెనుక ప్రేమ వ్యవహారం

సినిమా

శుభవార్త చెప్పిన స్టార్‌ జంట

బిగ్‌బాస్‌: ‘అవును ప్రేమించుకుంటున్నాం’

యాంకర్‌ సుమ ఆడపడుచు మృతి

బ‌డా నిర్మాత కూతురికి క‌రోనా

కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టా: కార్తీక్‌ ఆర్యన్‌

బెల్లీడాన్స్ నేర్చుకుంటున్న స్టార్‌ తనయ!