హోండా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం

11 Feb, 2018 14:10 IST|Sakshi

50 బైకులు దగ్ధం

సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి బజార్‌ సమీపంలో హోండా షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 50పైగా ద్విచక్రవాహనాలు దగ్ధమైనట్లు సమాచారం. అంతేకాకుండా పెద్ద ఎత్తున స్పేర్‌పార్ట్స్‌ కాలిపోయాయి. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు