నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు - వైరల్ వీడియో

29 Oct, 2023 19:51 IST|Sakshi

ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో అకారణంగా మంటలు చెలరేగడం, తద్వారా అనుకోని ప్రమాదాలు సంభవించడం గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియో పూణే మిర్రర్ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు రావడం గమనించవచ్చు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంలో తగిన చర్యలు తీసుకుంటున్నారు.

పూణే మిర్రర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఉదయం 8:30 గంటల ప్రాంతంలో స్కూటర్లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు, కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఓలా ఎలక్ట్రిక్ విచారణ చేపట్టనుంది. బాధితునికి కొత్త స్కూటర్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఇదీ చదవండి: ముఖేష్ అంబానీకి మరో మెయిల్! అడిగింది ఇవ్వకుంటే చంపేస్తామంటూ..

ఎలక్ట్రిక్ వాహనాల్లో చెలరేగే మంటలపై సంబంధిత కంపెనీలు సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే ఆదేశించింది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ ఈ పరిశోధన చేపట్టి కొన్ని బ్యాటరీ ప్యాక్‌లు, మాడ్యూల్స్ డిజైన్‌లతో సహా బ్యాటరీలలో కొన్ని లోపాలను నివేదించింది.

మరిన్ని వార్తలు