శుభకార్యానికి వెళ్లొస్తూ మృత్యుఒడిలోకి !

16 Jul, 2018 14:16 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబసభ్యులు

కోదాడఅర్బన్‌ : వారంతా తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మరో గంటసేపట్లో గమ్యం చేరనున్నారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న ఆటో కోదాడ బైపాస్‌ వద్దకు రాగానే టైర్‌ బరస్ట్‌ అయింది. అదుపుతప్పి వాహనం బోల్తాపడడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స నిమిత్తం విజ యవాడ తరలిస్తుండగా మృతి చెందాడు. మరో 17 మందికి గాయాలయ్యాయి.

ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కోదాడ బైపాస్‌లోని ఎస్‌ ఆర్‌ఎం పాఠశాల ఎదుట జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆం ధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా వత్సవాయి మం డలం మక్కపేటకు చెందిన శీలం గోపి పాత ఇను ము వ్యాపారం చేస్తున్నాడు. తన పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించేందుకుగాను సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని నెమ్మికల్‌లో గల దండుమైసమ్మ ఆలయానికి వచ్చారు.

శుభకార్యానికి అతడు తన స్నేహితులు, బంధువులను పిలవడంతో వారంతా అక్కడకు గోపి బంధువు సుభానికి చెందిన ట్రాలీ ఆటో నంబర్‌ 16 టీఈ 4693లో వచ్చారు. వీరంతా మధ్యాహ్నం విందు ముగించుకుని తిరిగి మక్కపేట, భీమవరంలకు వెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. 

ఆటోటైరు ఒత్తిడికి గురై..

ట్రాలీఆటోలో వెనుక మొత్తం 25మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఆటో కోదాడ బైపాస్‌రోడ్‌లోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాల సమీపంలోకి చేరుకోగానే ఆటో టైర్‌ ఒత్తిడికి గురై ఒక్కసారిగా పగిలిపోయిం ది. దీంతో ఆటో రోడ్డుపైనే బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా సామగ్రితో సహా రో డ్డుపై పడిపోయారు.

ఈ క్రమంలో ఆటో బోల్తాపడిన వేగానికి మక్కపేటకు చెందిన ఆళ్ల గురుస్వామి(25), పల్లెబోయిన వీరయ్య(50), షేక్‌ హుస్సేన్‌సాహెబ్‌(35) తీవ్ర గాయాలై అక్కడిక్కడే మరణించారు. మరో 17మందికి గాయాలయ్యా యి. ప్రమాద సంఘటన సమాచారమందుకున్న పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

రక్తసిక్తమైన బైపాస్‌ రోడ్డు

ఒకేసారి ముగ్గురు మృతిచెందడం, 17మంది గా యపడడంతో బైపసా రోడ్డు పూర్తిగా రక్తసిక్తమైంది. మృతుల బంధువుల రోదనలతో కోదాడ ప్రభుత్వాసుపత్రి దద్దరిల్లింది. ప్రమాద సంఘటన తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ కోదాడ ప్రభుత్వాసుపత్రికి చేరకుని మృతదేహాలను సందర్శించారు.

సానుభూతి తెలి పారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా