గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు

24 Aug, 2019 10:19 IST|Sakshi

శివారు స్కానింగ్‌ సెంటర్ల ఇష్టారాజ్యం

తాజాగా జాతీయ బృందం తనిఖీలు

ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్‌ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్‌డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్‌ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్‌ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్‌ జిల్లాలో 600పైగా స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి.

అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్‌ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్‌ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

21 ఏళ్ల జైలు జీవితం.. తర్వాత నిర్దోషిగా తీర్పు

బీజేపీ నేత కుమారుడు లండన్‌లో మిస్సింగ్‌

ఈర్ష్యతోనే కార్లు, బైక్‌లు దహనం

దారుణం: యువతిపై అత్యాచారం, హత్య

16 రాష్ట్రాలకు చెందిన 600 మంది యువతులతో..

కీచక తండ్రికి కటకటాలు

పాత రూ.500 నోటు ఇస్తే రూ.50 వేలు..

శ్రీకృష్ణుడి జన్మ స్థలానికి కి‘లేడీ’

నెలలు గడిచినా వీడని మిస్టరీ!

సొంత కూతుర్నే కిడ్నాప్‌.. అమ్మకం..!

కోడెల తనయుడి షోరూంలో అసెంబ్లీ ఫర్నిచర్‌

తల ఒకచోట.. మొండెం మరోచోట 

అటెన్షన్‌ డైవర్షన్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌

ఓయూ లేడిస్‌ హాస్టల్‌ ఆగంతకుడు అరెస్ట్‌

పరిశోధన పేరుతో కీచక ప్రొఫెసర్‌ వేధింపులు..

వందలమంది యువతుల్ని మోసం చేశాడు...

బెజవాడలో తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టు...

బిడ్డ నాకు పుట్టలేదు; నా దగ్గర డబ్బులేదు!

ఘాతుకం: నిద్రిస్తున్న వ్యక్తి తలపై..

కూతురి వ్యవహారంపై తండ్రిని దారుణంగా..

మరోసారి బట్టబయలైన కోడెల పన్నాగం

పదోన్నతి పొంది.. అంతలోనే విషాదం

ఏసీబీ దాడుల కలకలం

బంగారం దుకాణంలో భారీ చోరీ!

సోషల్‌ మీడియాలో చూసి హత్యకు పథకం

బంగ్లాదేశ్‌ వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఏసీబీ వలలో బాచుపల్లి తహసీల్దార్‌

లైంగిక దాడి కేసులో నిందితుల రిమాండ్‌

క్లాస్‌మేట్‌పై కక్షతోనే ‘పార్శిల్స్‌’?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

బల్గేరియా వెళ్లారయా

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

యాక్షన్‌ రాజా

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు