బాలికపై యాసిడ్‌ దాడి

24 Dec, 2019 08:22 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

ముంబై : పదిహనేళ్ల బాలికపై ముంబైలోని కంజుమార్గ్‌ ప్రాంతంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయుడు, సిబ్బంది కలిసి యాసిడ్‌ దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. బాధితురాలు మార్నింగ్‌ వాక్‌కు బయటకు వచ్చిన క్రమంలో ఎల్‌బీఎస్‌ రోడ్డు వద్ద నిందితులు ఆమెపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక గతంలో నషేమన్‌ ఉర్ధూ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదవగా ప్రస్తుతం మహీంలోని ఓ ఇనిస్టిట్యూట్‌ నుంచి ఎలక్ర్టానిక్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేస్తున్నారు. గతంలోనూ తనను అకారణంగా స్కూల్‌ సిబ్బంది, టీచర్లు శిక్షించేవారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన తనను అడ్డగించి స్కూల్‌ సిబ్బంది జావేద్‌, హషీం, అమన్‌లు తన చేతులను గట్టిగా పట్టుకోగా ప్రిన్సిపల్‌ హన్స్‌ అరా తనపై యాసిడ్‌ పోశారని చెప్పారు. అనంతరం తనను అక్కడే వదిలివేసి కారులో పారిపోయారని ఫిర్యాదులో తెలిపారు. బాధితురాలు తన తండ్రికి ఫోన్‌ చేయగా ఆయన అక్కడకు చేరుకుని ఆమెను రాజ్‌వాది ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టీడీపీ నేత బార్‌లో మద్యం విక్రయాలు

డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి

లక్ష విలువైన మద్యం బాటిల్స్‌తో పరార్‌

ప్రాణం తీసిన మద్యం మత్తు

క్వారెంటైన్‌లో వ్యాపారవేత్త ఆత్మహత్య

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు