ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య 

17 Apr, 2018 03:15 IST|Sakshi

పోలీసుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆరోపణ 

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): ఓ వ్యక్తి హత్య కేసు విచారణలో పోలీసులు ప్రశ్నించడంతో మన స్తాపం చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం బసంత్‌పూర్‌కు చెందిన కృష్ణ (32) మెదక్‌లో అసిస్టెంట్‌ జియా లజిస్టు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించు కొని ఈ నెల 13న బసంత్‌పూర్‌కు వచ్చాడు. 14న అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొ న్నాడు. ఈ కార్యక్రమంలో గొడవలు జరిగాయి. అల్గె శివరాజ్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.

సోమవారం ఉదయం కృష్ణ, అతడి తమ్ముడు మనోహర్‌ కలసి మెటల్‌కుంట రైల్వేస్టేషన్‌కు వెళుతుండగా శివరాజ్‌ హత్య కేసులో విచారించేందుకు వారిని హద్నూర్‌ పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. హత్య వివరాలపై పోలీసులు ప్రశ్నించారు. వివరాలు చెప్పకుంటే ఉద్యోగం పోవడంతోపాటు 4 నెలలు జైలుకు వెళ్లా ల్సి ఉంటుందని హెచ్చరించి మళ్లీ మంగళవారం స్టేషన్‌కు రావాలని పంపించి వేశారు. ఇంటికి వెళ్లిన కృష్ణ, మనోహార్‌ స్టేషన్‌లో జరిగినదంతా కుటుంబసభ్యులకు తెలిపారు. మనస్తాపానికి గురైన కృష్ణ బహిర్భూమికని బయటకు వెళ్లాడు.

ఎంతకీ తిరిగి రాకపోడంతో కుటుంబసభ్యులు బయటకు వెళ్లి వెతుకుతుండగా ఓ చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు.  పోలీసుల వేధింపుల వల్లే  మృతి చెందాడని  అతడి కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.  పోలీసులపై ఆరోపణల్లో వాస్తవం లేదని డీఎస్పీ రవి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు