కిడ్నాప్‌ కథ సుఖాంతం

31 Jul, 2019 02:11 IST|Sakshi
నిందితుడు శేఖర్‌

వారం రోజుల టెన్షన్‌కి తెర 

సురక్షితంగా నగరానికి సోనీ

హైదరాబాద్‌: యువతి కిడ్నాప్‌ కథ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. వారం క్రితం కిడ్నాపునకు గురైన బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ సురక్షితంగా నగరానికి చేరడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 23న రాత్రి యువతి అపహరణకు గురైనప్పటి నుంచి పలు మలుపులు తిరుగుతూ వచ్చిన కిడ్నా ప్‌ కథ మంగళవారం ఉదయం సోనీ నగరానికి వచ్చిందని తెలి యడంతో పోలీసులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నా రు. ఇబ్రహీంపట్నం సమీపం లోని బొంగుళూరు గేటు వద్ద టీ స్టాల్‌ నడిపే ఎలిమినేటి యాదగిరి కూతురు సోనీ(22)కి ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి 23న రవిశేఖర్‌ కారులో ఎక్కించుకుని హయత్‌నగర్‌ వరకు తీసుకొచ్చి రాత్రి 8:30 గంటల సమయంలో కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు అప్పటి నుంచి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితుడు వాడిన కారు నంబర్‌ నకిలీదని తెలిసి కంగుతిన్నారు. అతని ఆచూకీ కోసం ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఐదు ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నా యి. 3 రోజులు గడిచినా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు, కుటుంబ సభ్యు ల్లో ఆందోళన పెరిగింది. చివరకు నిందితుడిని రవిశేఖర్‌గా గుర్తించిన పోలీసులు అతను ఆ కారును బళ్లారి నుంచి దొంగిలించినట్లుగా కనుగొన్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడు చిక్కకపోవడంతో పోలీసులు అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిని ప్రకటించారు. ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం ఉదయం సోనీ నగరానికి చేరుకుంది.

మీడియా కంట పడకుండా...
ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే సోనీ తల్లిదండ్రులకు ఫోన్‌ చేయగా వారు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. వారు సోనీ ని సరూర్‌నగర్‌ మహిళా పోలీస్టేషన్‌కు తరలించి, అక్కడి నుంచి ఎల్‌బీనగర్‌ సీసీఎస్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. మంగళవారం మొత్తం సోనీ మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. నిందితుడు రవిశేఖర్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా అధికారులు ధృవీకరించడంలేదు. ఈ కిడ్నాప్‌ ఘటనపై  రాచకొండ పోలీసులు సోనీని, రవిశేఖర్‌ను విచారిస్తున్నట్లు తెలిసింది.  వైద్య పరీక్షల నిమిత్తం సోనీని వైద్య పరీక్షల నిమిత్తం పేట్ల బురుజులోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించి నట్లు సమాచారం. నిందితుడు బళ్లారిలో దొంగిలించిన కారుకు ఉన్న జీపీఆర్‌ఎస్‌తో పోలీసులు కారు కదలికలను కనుగొన్నారు. కర్నూలు, తిరుపతిలో అతని కదలికలు గుర్తించారు. చివరికి అద్దంకి, ఒంగోలులో పట్టుకున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని..

గ్యాంగ్‌ లీడర్‌ ఇంకా చిక్కలేదు: సీపీ

అరిస్తే చంపేస్తానని బెదిరించాడు..

కాపురానికి రాలేదని భార్యను..

ఫేస్‌బుక్‌ ప్రేమ; రూ.11 లక్షలు గోవిందా..!

ప్రాణం తీసిన ‘హైడ్‌ అండ్‌ సీక్‌’ ఆట

భార్యకు కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు

ఘరానా మోసగాడు షేక్ సర్దార్ హుస్సేన్ అరెస్టు

బైక్‌ను తీసుకొని పారిపోతుండగా..

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

అర్చకత్వం కోసం దాయాది హత్య

భర్త వేధింపులతో ఆత్మహత్య 

సెక్యూరిటీ గార్డు నుంచి ఘరానా దొంగగా!

అన్నను చంపిన తమ్ముడు

సంగం డెయిరీ భారీ చోరీని ఛేదించిన పోలీసులు

తల్వార్‌తో రౌడీషీటర్‌ వీరంగం

నాడు అలా.. నేడు ఇలా..

రైస్‌ పుల్లింగ్‌ ముఠా అరెస్టు

నగదుతో ఉడాయించిన వ్యక్తే కిడ్నాపరా?

సంగం డెయిరీలో రూ.44.43 లక్షల చోరీ

తలలు ఓ చోట, మొండాలు మరోచోట..

కోడెల శిష్యుడు కోర్టులో లొంగుబాటు

గంగస్థాన్‌–2లో దొంగతనం 

కన్న కూతురిపై లైంగిక దాడి

వలస జీవుల విషాద గీతిక

భవనంపై నుంచి దూకిన కానిస్టేబుల్‌.. విషాదం

ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్‌

నకిలీ మావోయిస్టుల ముఠా అరెస్ట్‌

అనుమానాస్పద స్థితిలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ మృతి

గోరింటాడ యువకుడు లాత్వియాలో మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో వంటగ్యాస్‌, నీళ్లు కట్‌

‘ప్రేమ చూపిస్తున్నారా.. దాడి చేస్తున్నారా?’

బిగ్‌బాస్‌.. భార్యాభర్తల మధ్య గొడవలు

బిగ్‌బాస్‌లో రేలంగి మామయ్య

బోయపాటికి హీరో దొరికాడా?

హౌస్‌మేట్స్‌పై హేమ సంచలన వ్యాఖ్యలు