పసి బాలుడిపై వార్డెన్‌ లైంగిక దాడి

7 Jun, 2020 16:05 IST|Sakshi

డెహ్రాడూన్‌ : లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ హాస్టల్‌లో ఒంటరిగా చిక్కుకుపోయిన తొమ్మిదేళ్ల బాలుడిపై వార్డెన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. పసి బాలుడని చూడకుండా తన వ్యక్తిగత పనులు చేయిస్తూ ప్రతి రోజు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఓ ప్రేవేటు పాఠశాలలో గత నెలలో ఈ ఘోరం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవల డెహ్రాడూన్‌కు వచ్చారు. కానీ విద్యార్థిని అప్పగించేందుకు తొలుత స్కూలు యాజమాన్యం ఒప్పకోలేదు.

అనుమానం వచ్చి తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గత్యంతరం లేక బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంటికెళ్లిన బాలుడు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించారు. తనతో వ్యక్తిగత పనులను చేయించుకుంటూ లైంగికదాడికి పాల్పడ్డాడని చెప్పాడు.దీంతో బాలుడు తల్లిదండ్రులు శనివారం రోజు హరీశ్‌(30) అనే వార్డెన్‌పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.  నిందితుడిపై పొక్సో చట్టంతో పాటూ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందిడుని అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా