ఐటీ సిటీలో మహా మోసగాడు

16 Jun, 2020 07:23 IST|Sakshi
నిందితుడు మాథ్యూస్‌ (ఫైల్‌) 

లండన్‌లో ఉద్యోగమని మహిళలకు బురిడీ  

ఇద్దరు మహిళల నుంచి లక్షలు స్వాహా  

ఐటీ సిటీలో మోసగాడు అరెస్టు  

సాక్షి, కర్ణాటక : ఓ ఉపాధ్యాయురాలిని మోసగించిన కేసులో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి సామాన్యుడు కాదు, మేకవన్నె పులి వంటి కామాంధుడు అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అమాయక మహిళలను దోచుకోవడంలో నేర్పరి అని వెల్లడైంది. ఇతడు చదివింది కేవలం పీయూసీ వరకే. అయినా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని, లండన్‌లో ఉద్యోగమని చెలామణి అవుతూ ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా, ఆర్ధికంగా దోచాడు, అలాగే పలువురిని లక్షలాది రూపాయల మేర చీటింగ్‌ చేసిన జో అబ్రహాం మాథ్యూస్‌ అనే కేరళవాసి ఉదంతం బెంగళూరులో చర్చనీయాంశమైంది.  

సహజీవనం, సొమ్ము కైంకర్యం
ఇతని విచారణలో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరులో ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి గత 9 ఏళ్లు పాటు సహజీవనం చేసి రూ.45 లక్షలు సొమ్ము కాజేసినట్లు తెలిసింది. అతనిపై బాధితురాలు బెంగళూరులో కేసు పెట్టింది. అంతకు ముందే ఓ టీచర్‌కు కూడా ఇలాగే రూ.38 లక్షలు టోపీ వేశాడు. కోరమంగల నివాసి అయిన నిందితుడు (35)ని గత వారం అత్యాచారం కేసులో నగర పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

అబద్ధాలతో గొప్పలు  
ఇతనికి పెళ్లయి బెంగళూరులో ఉంటున్నాడు. కానీ అవివాహితున్నని, లండన్‌లో ఉన్నట్లు నమ్మించి పలువురు మహిళలను వివాహం చేసుకుంటానని లైంగికంగా వాడుకుని డబ్బులు, ఆస్తులు కొట్టేయడంతో ఆరితేరాడు. ఎల్రక్టానిక్‌ సిటీ పోలీస్‌స్టేషన్‌లో 39 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఇతని పాపాల పుట్ట కదిలింది. ఆమె ఓ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లో పెట్టిన ప్రొఫైల్‌ను చూసిన మోసగాడు 2012లో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు తళత్‌ ప్రసాద్‌ అని పెళ్లాడతానని వలలో వేసుకున్నాడు. దేశంలో పలు ప్రాంతాల్లో విహార యాత్రలు చేశారు. లండన్‌లో బ్రిటిష్‌ రాయబార కార్యాలయంలో పనిచేస్తానని చెప్పుకున్నాడు.

అనంతరం తనకు అనేక వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని ఆమె నుంచి విడతల వారీగా రూ.45 లక్షలు దండుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడగ్గా, ఏదో ఒక మాట చెప్పి వాయిదా వేయసాగాడు.  ఇక 2016లో ఓ మహిళపై మాథ్యూస్‌ అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలుకెళ్లి జామీనుపై విడుదలయ్యాడు. దీనిపై ప్రశ్నించిన మహిళను అబద్ధమని ఏమార్చాడు. ఆమె పెళ్లి చేసుకోవాలని, లేదంటే తన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నగ్న ఫోటోలను బయటపెడతానని బెదిరించేవాడు. కోరమంగలలో ఉన్న మ్యాథ్యూస్‌ ఇంటికి ఆ మహిళ వెళ్లినప్పుడు అతని భార్య స్త్రీ కనిపించింది. ఆమె తన సహోదరి అని నమ్మించాడు. కానీ ఆమె భార్య కాదని, అతని మోసాల్లో భాగస్వామి అని పోలీసులు తెలిపారు.  చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే.. 

ఎందరికో టోపీ  
ఎల్రక్టానిక్‌సిటీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన బాధితురాలు తన డబ్బు వెనక్కి ఇప్పించాలని పేర్కొంది. అంతకు ముందు కెనడాలో నివాసం ఉండే మహిళను సైతం ఇదేవిధంగా మోసగించాడు. ఆమె పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి ఓ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకుని ఎగవేశాడు. పోలీసులు దుండుగున్ని కోర్టులో హాజరు పరిచి తమ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తులో మరిన్న బాగోతాలు బయటపడే అవకాశముంది. 

చదవండి: ఉచితంగా బిర్యానీ ఇవ్వలేదని..

మరిన్ని వార్తలు