పోలీసులకు చిక్కకుండా పరార్‌

12 Nov, 2018 11:07 IST|Sakshi
ఆసిఫ్‌

ట్రాఫిక్‌ పోలీసుల మ్యాన్‌ప్యాక్‌తో మాయం

ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్న పోలీసులు  

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లోని తెలంగాణ స్టడీ సర్కిల్‌ వద్ద శనివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నారాయణగూడ ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో నివసించే ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆసిఫ్‌ కారులో అదుపుతప్పిన వేగంతో దూసుకెళ్తుండగా ట్రాఫిక్‌ ఎస్‌ఐ కృష్ణంరాజు కారును ఆపేందుకు యత్నించాడు. అదే సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ హోంగార్డు చేతిలో ఉన్న మ్యాన్‌ప్యాక్‌తో కారుకు అడ్డంగా నిల్చొని ఆపాలంటూ కోరాడు.

ఆ సమయంలో హోంగార్డు చేతిలో నుంచి మ్యాన్‌పాక్‌  ఆసిఫ్‌ నడుపుతున్న కారులో పడింది.  ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఆసిఫ్‌ కారులో వారికి చిక్కకుండా దూసుకెళ్ళాడు. మ్యాన్‌ప్యాక్‌ కారులో పడిపోవడంతో ఆందోళన చెందిన ట్రాఫిక్‌ పోలీసులు ఎట్టకేలకు ఆ కారు నంబర్‌ ఆధారంగా యజమానిని గుర్తించారు. లోయర్‌ట్యాంక్‌బండ్‌లో ఉండే ఆసిఫ్‌ను ఆదివారం ఉదయం గుర్తించి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోగొట్టుకున్న మ్యాన్‌ప్యాక్‌ను ఏం చేశారో చెప్పాల్సిందో ఆసిఫ్‌ను కోరగా తన కారులో లేదని బుకాయించాడు. అయితే పోలీసులు ఆసిఫ్‌ను విచారిస్తున్నారు. ఈ మ్యాన్‌ప్యాక్‌ పొరపాటున కారులో పడిందా లేక ఆసిఫ్‌ లాక్కొని పరారయ్యాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు