ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

21 Jul, 2019 13:19 IST|Sakshi
సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏడీసీపీ సురేష్‌బాబు

41.75 తులాల బంగారు ఆభరణాల అపహరణ

రూ.2.60 లక్షలు చోరీ

సాక్షి, పద్మనాభం (భీమిలి): మండలలంలోని చేరిఖండంలో ఇద్దరు ఉపాధ్యాయునుల ఇళ్లలో శనివారం చోరీ జరిగింది. 41.75 తులాల బంగారు అభరణాలు, రూ.2.60 లక్షలు నగదు అపహరించారు. వివరాలిలా ఉన్నాయి. చేరిఖండం గ్రామానికి చెందిన పల్లంటి రాణి దువ్వుపేట ప్రాథమిక పాఠశాలల్లో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె ఇంటిలో తగరపువలసకు చెందిన ఎన్‌.ఎం.సి మాధురి అద్దెకు ఉంటుం ది. మాధురి రెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీషు టీచర్‌గా పనిచేస్తోంది. వీరిద్దరు ఉదయం ఇళ్ల గేట్లకు తాళాలు వేసి విధులకు వెళ్లారు.

వీరు ఇళ్ల వద్ద లేరని గమనించిన దుండగులు గేటు తాళం కప్పలు విరగొట్టి లోపలికి ప్రవేశించారు. మాధురి పాఠశాల నుంచి విధులు ముగించుకుని సాయంత్రం 4.45 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చే సరికి గేట్లు, లోపల ఉన్న బీరువాలు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న మూడు తులాల బంగారం గొలుసు, రెండు తులాల చిన్న చిన్న బంగారు అభరణాలు, రూ.30వేలు నగదు అపహరించినట్టు గుర్తించింది. రాణి పాఠశాల నుంచి రెడ్డిపల్లిలో ఉన్న అమ్మగారి ఇంటి వద్దకు వెళ్లింది. రాణి ఇంటిలో దొంగతనం జరిగిందని ఆమె తండ్రి ఆదినారాయణకు విద్యార్థుల ద్వారా మాధురి సమాచారం అందించింది. తండ్రి ఆదినారాయణ ఫోన్‌ చేసి ఈ విషయం రాణికి తెలిపారు.


వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌ 

ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలో బీరువులో ఉన్న 36.75 తులాల బంగా>రు అభరణాలు, రూ.2.30లక్షలు నగదు అపహరించినట్టు గుర్తించారు. రాణి కుమారుడు తరుణ్‌తేజకు ఎంబీబీఎస్‌ ప్రవేశానికి ఫీజు కట్టడానికి ఈ నగదును శుక్రవారం తెచ్చి బీరువాలో ఉంచినట్టు పేర్కొన్నారు. తన ఇంటిలో దొంగతనం జరగడంతో రాణి బోరున విలపించింది. మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో దొంగతనం జరిగినట్టు భావిస్తున్నారు. క్లూస్‌ టీం వేలి ముద్రలు సేకరించింది. క్రైమ్‌ ఏడీసీపీ వి.సురేష్‌బాబు చోరీ జరిగిన సంఘటన ప్రాంతాలను పరిశీలించారు. ఎస్‌ఐ అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు