ప్రముఖ నటుడి ఇంట్లో చోరీ.. లక్షలు కాజేసిన పనిమనిషి!

28 Oct, 2023 18:57 IST|Sakshi

ప్రముఖ నటుడి ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని నెలల నుంచి ఇంట్లో పనులు చేస్తున్న ఒకామె.. లక్షలు విలువ చేసే డబ్బు, బంగారం తీసుకుని జంప్ అయిపోయింది. ఇప్పుడీ విషయమై సదరు నటుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె పనిమనిషి కాదని, దొంగతనంలో ఎలా ముదిరిపోయిందనేది కూడా సదరు నటుడు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: 'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!)

ఇంతకీ ఏం జరిగింది?
మరాఠీ నటుడు పుష్కర్ ష్రోత్రి ఇంట్లో ముగ్గురు పనివాళ్లు ఉన్నారు. ఇంటిపనులు చూసుకోవడంతో పాటు ఇతడి తండ్రి బాగోగులని చూసుకోవడం వాళ్ల పని. కానీ ఇందులో ఉష(41) అని ఆమె మాత్రం 5-6 నెలల నుంచి పుష్కర్ ఇంట్లో పనిచేస్తోంది. ఈమెనే.. పుష్కర్ ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షలు డబ్బులు, 60 వేల విదేశీ కరెన్సీని.. అక్టోబరు 22న దొంగతనం చేసింది. కానీ అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం యజమానికి తిరిగొచ్చేసింది.

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే అక్టోబరు 24న.. బంగారం విషయంలోనూ పుష్కర్ దంపతులకు ఎందుకో అనుమానమొచ్చింది. బీరువాలో బంగారం ఉన్నా సరే దాన్ని పరిశీలించి చూడగా, అది నకిలీది అని తేలింది. పనిమనిషి ఉషనే.. రూ.10 లక్షలు విలువ చేసే బంగారంతో ఆల్రెడీ పరార్ అయిపోయినట్లు బయటపడింది. దీంతో పుష్కర్, అక్టోబరు 26న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడీ ఇదంతా వెలుగులోకి వచ్చింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

మరిన్ని వార్తలు