దయచేసి... అటువంటి ఫిర్యాదులు చేయొద్దు!

9 Jan, 2019 09:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై : ‘ మేము దొంగలించబడిన వస్తువులను తిరిగి తీసుకురాగలం. కానీ కొంతమంది మాత్రం మేము పరిష్కరించలేని, అసాధారణ ఫిర్యాదులు చేస్తుంటారు’ అంటూ తమకు ఎదురైన విచిత్రమైన అనుభవం గురించి నాగ్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ భూషణ్‌ కుమార్‌ ఉపాధ్యాయ చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన సంవత్సరాంతపు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ... ఈ ఏడాది దొంగిలించబడిన 82 లక్షల రూపాయల విలువైన వస్తువులను యజమానులకు అప్పగించగలిగామని తెలిపారు. అయితే అదే సమయంలో ఓ యువకుడు చేసిన ఫిర్యాదుతో మాత్రం తమ టీమ్‌ ఇబ్బంది పడిందని పేర్కొన్నారు.

నా గుండె దొంగిలించింది సార్‌!
తన గుండెను ఓ అమ్మాయి దొంగిలించందంటూ సదరు యువకుడు చేసిన ఫిర్యాదును నమోదు చేసుకునేందుకు ఎటువంటి సెక్షన్లు లేకపోవడంతో అతడిని వెనక్కి పంపించాల్సి వచ్చిందని భూషణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎంతో మంది ప్రజలు సమస్యలతో అల్లాడుతూ పరిష్కారం కోసం తమ వద్దకు వస్తుంటారని, అయితే ఇటువంటి విచిత్ర కేసుల్లో మాత్రం తాము చేసేదీ ఏమీ ఉండదని.. దయచేసి ఇటువంటి విషయాలతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దని కోరారు.

మరిన్ని వార్తలు