ఆధిపత్య పోరులోనే కోటయ్య హత్య

9 Aug, 2019 11:51 IST|Sakshi

ఆరుగురు నిందితుల అరెస్ట్‌

సాక్షి, చేబ్రోలు: దళిత నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే ఎమ్మార్పీఎస్‌ మాజీ నేత, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు పమిడిపాటి కోటయ్య హత్యకు ప్రధాన కారణమని చేబ్రోలు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ శ్రీనివాసరావు తెలిపారు. మండలకేంద్రలోని సర్కిల్‌ కార్యాలయంలో గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. జూలై 5వ తేదీ రాత్రి చేబ్రోలు మండల పరిధిలోని వేజండ్ల పల్లె అడ్డరోడ్డు దగ్గర అమృతలూరు ప్రాంతానికి చెందిన పమిడిపాటి కోటయ్య హత్యకు గురయ్యాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఘటనకు కారణమైన ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు, తెనాలి ఐతానగర్‌కు చెందిన కొత్తపల్లి నాగరాజు, కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజేంద్ర, కూచిపూడి మోహన్, సుద్దపల్లి కిషోర్‌లు కోటయ్య హత్యకు కారకులని వెల్లడించారు.

సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతుడు పమిడిపాటి కోటయ్య, తెనాలి ప్రాంతానికి చెందిన సుద్దపల్లి నాగరాజు  గతంలో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. కోటయ్యను ఎమ్మార్పీఎస్‌ నుంచి తొలగించిన తరువాత వీరిద్దరికి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోటయ్య ఫేస్‌బుక్, వాట్సప్‌లలో పీక కోస్తానని, చంపుతానని పోస్టులు పెట్టడంతో ఎక్కడ తనను చంపుతాడోనని భావించి ముందుగానే నాగరాజు కోటయ్యను చంపాలని నిర్ణయించుకొని మరి కొంత మంది సహకారంతో పథకం ప్రకారం హత్య చేశాడు. కోటయ్య కదలికలను గమనించి స్కార్పియాతో ఢీ కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన కారు, ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐతో పాటు స్థానిక ఎస్‌ఐ సీహెచ్‌ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ

మంచినీళ్లు తెచ్చేలోపే.. 

స్నేహితుడి భార్య కోసం హత్య..!

అమెరికాలో ‘చచ్చేవరకు ఉండే జబ్బు’

గుజరాత్‌ కోర్టుకు ఐఎస్‌ఐ తీవ్రవాది

మాకేదీ న్యాయం? :హాజీపూర్‌ వాసులు

వజ్రాలు కొన్నాడు... డబ్బు ఎగ్గొట్టాడు

దొంగ పనిమనుషులతో జరజాగ్రత్త..

పసి మొగ్గలను నలిపేస్తున్న కీచకులకు ఉరే సరి!

తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..

బాత్‌రూంలో ఉరివేసుకొని నవవధువు మృతి

స్టార్‌ హోటల్‌లో దిగాడు.. లక్షల్లో బిల్లు ఎగ్గొట్టాడు

అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

ప్రాణం బలిగొన్న జాలీ రైడ్‌

టాయిలెట్‌ సీటును నోటితో శుభ్రం చేయాలంటూ..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

భర్తను పోలీసులకు అప్పగించిన మహిళ

మహిళలే..చోరీల్లో ఘనులే!

అబ్రకదబ్ర..కుక్కర్‌లో బంగారం వేడి చేస్తే..!

అమెరికాలో కత్తిపోట్లు..

ఉన్మాదికి ఉరిశిక్ష

సెయిల్‌ ఛైర్మన్‌పై హత్యాయత్నం?

వరంగల్‌ శ్రీహిత హత్యకేసులో సంచలన తీర్పు 

కాపాడబోయి.. కాళ్లు విరగ్గొట్టుకున్నాడు..!

విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్

‘పాయింట్‌’ దోపిడీ..!

ఇళ్ల మధ్యలో గుట్టుగా..

ఆదిత్య హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు..

‘గాంధీ’ సూపరింటెండెంట్‌ సంతకం ఫోర్జరీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమ్మాయి పుట్టింది : మంచు విష్ణు

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు