పాపం.. పసివాడు

19 Feb, 2018 07:20 IST|Sakshi
(ప్రతీకాత్మక చిత్రం)

తల్లి మృతి..దూరంగా తండ్రి

19 రోజులుగా మార్చురీలోనే పింకీ మృతదేహం

గచ్చిబౌలి: అమ్మ కనిపించక 19 రోజులైంది.. నాన్నేమో దూరంగా ఉన్నాడు.. హోంలో ఆ ఎనిమిదేళ్ల బాలుడు అనాథలా మిగిలిపోయాడు. పింకీ హత్య కేసు నేపథ్యంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి.  బిహార్‌కు చెందిన పింకీ కుటుంబసభ్యులు ఇటుక బట్టీలలో కూలీ పనులు చేస్తున్నారు. పింకీకి 13 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన దినేష్‌తో వివాహం జరిగింది. కొడుకులు దేవ్‌(10),  జతిన్‌(08), కూతురు నందిని(05) ఉన్నారు.  పెద్ద కొడుకు దేవ్, కూతురు న ందిని భర్త వద్ద వెళ్లి చిన్న కొడుకు జతిన్‌ను తీసుకొని మూడేళ్ల క్రితమే వికాస్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లింది. నమ్మి వంచిచిన వికాస్‌ కశ్యప్‌ మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను కోసి మూటగట్టి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పేడేసిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌కు రానున్న కుటుంబ సభ్యులు
పింకి కుటుంబ సభ్యలు కటిక పేదరికంలో ఉన్నారు. కనీసం చిన్నప్పటి నుంచి పోటో కూడా దిగలేదని పోలీసులు చెబుతున్నారు. కూలీ పనులు చేసుకునే పింకీ  తల్లిదండ్రులు, సోదరుడు హైదరాబాద్‌కు వచ్చేందుకు రవాణా ఖర్చులు కూడా లేక పోవడంతో ఎవరూ వచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పింకీ తండ్రి డప్పూ లియా, సోదరుడు సింతూ లియా, సోదరికి మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. ఉస్మానియా మార్చురీలో ఉన్న  పింకీ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు సన్నహాలు చేస్తున్నారు. గచ్చిబౌలి పోలీసులు ఇప్పటికే పింకీ మృతదేహం తీసుకునేందుకు కుటుంబ సభ్యులను హైదరాబాద్‌కు పంపాలని బీహర్‌ పోలీసులతో మాట్లాడినట్లు తెలిసింది.  కుటుంబ సభ్యులు ఇష్ట ప్రకారమే అంత్య క్రియలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. వారికి ఇష్టమైతే మృతదేహాన్ని తీసు కెళ్లవచ్చని, లేదా హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు చేస్తామంటే తమ సహకారం ఉంటుందన్నారు. జతిన్‌ను తీసుకెళ్లేందుకు తండ్రి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు