భరత్‌రెడ్డి కోసం పోలీసుల గాలింపు

21 Nov, 2017 12:16 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ : ఇద్దరు దళితులను అవమానించిన బీజేపీ నేత భరత్ రెడ్డి కోసం రెండు బృందాల పోలీసులు గాలింపు చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం ఎర్రకుంట చెరువు నుంచి అక్రమంగా జరుపుతున్న మొరం తవ్వకాలను అడ్డుకున్నందుకు అభంగపట్నంకు చెందిన ఇద్దరు దళితులు లక్ష్మణ్‌, రాజేశ్వర్‌లను మురికి నీళ్ళలో ముంచి భరత్‌రెడ్డి అవమానించాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ఈ నెల 12 న సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అయింది. దాంతో భరత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు.

పది రోజులుగా బాధితులు కూడా కనిపించడం లేదు. బాధితుల కుటుంబీకులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఆదివారం రాత్రి లక్ష్మణ్‌ భార్య లత, రాజేశ్వర్‌ భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భరత్‌రెడ్డిపై నవీపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేయాలని దళిత సంఘాల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, భరత్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. కాగా భరత రెడ్డిపై పోలీసులు కిడ్నాప్‌ కేసు  కూడా నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు