గోవధ నేపథ్యంలోనే లైంగిక దాడి..?

12 Apr, 2018 08:45 IST|Sakshi

సాక్షి, శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి జరిపి హతమార్చిన కేసులో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు 22 మంది సాక్షులను విచారించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం బకర్వాల్‌ వర్గీయులు గో వధకు పాల్పడ్డారనే ఆగ్రహంతో ఈ ఘటన జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. మైనర్‌ బాలికపై ఘాతుకానికి బకర్వాల్‌ వర్గీయులు గోవును వధించారనే అనుమానాలు కూడా ఓ కారణమని దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం.

ఎనిమిది మంది నిందితులపై లైంగిక దాడి, సాక్ష్యాల తారుమారు, నేరపూరిత కుట్ర వంటి అభియోగాలతో రెండు చార్జిషీట్లు నమోదయ్యాయి. నిందితుల్లో సంఝీరాం, ఆయన కుమారుడు విశాల్‌, స్పెషల్‌ పోలీస్‌ అధికారులు దీపక్‌ ఖజురియా, సురేందర్‌ వర్మ, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రాజ్‌, ఎస్‌ఐ ఆనంద్‌ దత్తా, పర్వేష్‌ కుమార్‌, సంఝీరాం మేనల్లుడులున్నారు. బకర్వాలా వర్గీయులు గో వధకు పాల్పడతారని, డ్రగ్‌ ట్రాఫికింగ్‌ నడిపిస్తారనే అభిప్రాయం ఓ నిర్ధిష్ట వర్గంలో వేళ్లూనుకున్నదని అధికారులు తెలిపారు. బకర్వాలా వర్గీయులపై ఆగ్రహం పెంచుకున్న క్రమంలో మైనర్‌ బాలికపై కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

మరిన్ని వార్తలు