శ్రీనివాసులు దొరికాడు

18 Jul, 2018 12:02 IST|Sakshi

ఐదు నెలలుగా పరారీలో వ్యభిచార దందా నిర్వాహకుడు

పదికి పైగా కేసులు

పీడీయాక్ట్‌ నమోదుతో అదృశ్యం

కేపీహెచ్‌బీలో టాస్క్‌ఫోర్స్‌ పట్టివేత

సాక్షి, హైదరాబాద్‌ : వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా నిర్వహిస్తూ, పీడీ యాక్ట్‌ ప్రయోగం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శ్రీనివాసులును ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బైరామల్‌గూడకు చెందిన శ్రీనివాసులు అనేకమంది మహిళలు, యువతుల్ని వ్యభిచార దందాలోకి దింపాడు. ఈ రకంగా సంపాదించిన సొమ్ముతోనే బైరామల్‌గూడలో 200 గజాల స్థలంలో మూడు పోర్షన్స్‌తో కూడిన ఇల్లు సైతం కట్టినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఏళ్ళుగా వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఇతగాడిపై మలక్‌పేట, బంజారాహిల్స్, సైదాబాద్, మీర్‌పేట, సరూర్‌నగర్, వనస్థలిపురం ఠాణాల్లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి.

శ్రీనివాసులు నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ అంజినీ కుమార్‌ ఐదు నెలల క్రితం పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇతగాడి కోసం ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో కేపీహెచ్‌బీ ప్రాంతంలో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకుని సైదాబాద్‌ పోలీసులకు అప్పగించారు. వీరు అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

మరిన్ని వార్తలు