అతివేగానికి ఆరుగురి బలి

22 Jun, 2019 12:30 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన లారీ, దెబ్బతిన్న ఆటో

సాక్షి, కోదాడ : మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అబ్జల్‌పాషా(48), గౌసియాబేగం(40), మహబూబ్‌పాషా(40) మహిముదాబేగం(35), మాహిన్‌(15), ముస్కాన్‌(12), జాకిర్‌ పాషా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో షేక్‌ అబ్జల్‌ పాషా ఇంటి పెద్ద. తన చెల్లెలు అక్తర్‌బేగం  మనవరాలు బారసాల ఫంక్షన్‌కు బుధవారం కో దాడ వచ్చారు. శుభకార్యం పూర్తికాగానే హుజూర్‌నగర్‌లో నివాసముంటున్న అబ్జల్‌పాషా చిన్న తమ్ముడు యాకుబ్‌ పాషా ఇంటికి వచ్చారు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి గురువారం ఉదయం జాన్‌పహాడ్‌ దర్గాకు వెళ్లి అదే రోజు రాత్రి 7గంట లకు హుజూర్‌నగర్‌కు చేరుకున్నారు. అయితే రాత్రి అక్కడే నిద్రపోయి తెల్లవారుజామున 6 గం టలకు లేచి తమ స్వగ్రామానికి బయలుదేరారు. 

ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో..
కుటుంబ సభ్యులందరూ తెల్లవారుజామునే లేచి స్వగ్రామానికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. దీంతో హుజూర్‌నగర్‌లోనే కోదాడకు వెళ్లే ఆటోను మాట్లాడుకుని అందులో ఎక్కారు. చిలుకూరు మండలం చిలుకూరు మండలం సీతా రంపురం వద్దకు చేరుకోగానే ఆటో డ్రైవర్‌ ముం దున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. రెప్ప పాటులో చోటు చేసుకున్న ఈ ఘోర దుర్‌ఝటనలో షేక్‌ అబ్జల్‌పాషా, గౌసియాబేగం, మహిముదా బేగం, మాహిన్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఆటోలో ప్రయాణిస్తున్న మహబూబ్‌పాషా, ము స్కాన్, జాకిర్‌ పాషా, ఆటో డ్రైవర్‌ నాగుల్‌ మీరా కు తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు రోడ్డు పై చెల్లా చెదురుగా పడిపోయాయి. వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను తొలుత హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం జిల్లాకు తరలించారు. మార్గమధ్యలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్దకు చేరుకోగానే పరిస్థితి విషమించి ముస్కాన్‌ మృతి చెందింది. మహబూబ్‌పాషా కూడా ఖమ్మం జిల్లాలోని ఓ ప్రైవేట్‌ ఆ స్పత్రిలో చికిత్స పొందు తూ మృత్యుఒడికి చేరుకోగా డ్రైవర్‌ నాగుల్‌ మీరా, జాకిర్‌ పాషా చికిత్స పొందుతున్నారు. 

రెండు కుటుంబాల్లో మిగిలింది ఒక్కరే..
ప్రమాదంలో దుర్మరణం పాలైన షేక్‌ అబ్జల్‌పాషా ఇంటి పెద్ద.  ఈయన తోడ మొత్తం ఏడుగురు. ముగ్గురు చొప్పున తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారు. అబ్జల్‌ పాషా, మహమూద్‌ పాషా కుటుంబాలు స్వగ్రామంలోనే ఉంటుండగా, చిన్న తమ్ముడు యాకుబ్‌ పాషా హుజూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని ఆరుగురు మృతిచెందగా జాకిర్‌పాషా తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన విషయం తెలుసుకున్న బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఆరుగురు బలైపోవడంతో బోరున విలపించారు. 

ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కాగా విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, కోదాడ రూరల్, టౌన్‌ సీఐలు రవి. శ్రీనివాస్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  చిలుకూరు ఎస్‌ఐ వెంకన్నను వివరాలు అడిగి తెలుసుకుని తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!