కుళ్లిన మాంసం..నాసిరకం అల్లం

24 May, 2018 12:28 IST|Sakshi
రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు  

అవి మంచిర్యాలలోని ప్రముఖ రెస్టా రెంట్లు... కాబట్టి ఆహార పదార్థాల్లో నాణ్యతను పాటిస్తారని ప్రజలు నమ్ము తారు. కానీ నాణ్యతలేని పదార్థాలు, కుళ్లిన మాంసం వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యా లతో చెలగాటమాడుతున్నారు. బుధ వారం పలు రెస్టారెంట్లలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వాటి బండారం బయట పడింది. అలాగే కళాంజలి పేరుతో తయార వుతున్న అల్లంపేస్ట్, మసాలా దినుసుల్లో నాణ్యత లోపాన్ని అధికారులు గుర్తించారు.  

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రముఖ రెస్టారెంట్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం పంజా విసిరారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ విజయసారథి ఆధ్వర్యంలో ఏ–1,  సురభి గ్రాండ్, మాధవి, బాబా రెస్టారెంట్లలో ఆకస్మిక దాడులు చేసి ఆహార పదార్థాలను పరిశీలించారు. కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, మటన్, చికెన్‌ లభించండంతో కేసు నమోదు చేశారు. వాటి నిర్వా హకులకు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. తదుపరి చర్యల నిమిత్తం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారికి అప్పగించారు.

అల్లం పేస్టు.. మసాలాలు సైతం.. 

జిల్లా కేంద్రంలోని కళాంజలి అహార పదార్థాల తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. కళాంజలి బ్రాండ్‌ పేరుతో తయారీ చేసిన నిత్యావసర ఆహార పదార్థాలను నాణ్యత లేకుండా వివిధ కిరాణాలకు సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడి చేసి వాటిని పరిశీలించారు. అల్లం పేస్టు తయారు చేసి శుభ్రంగా లేని డ్రమ్ములో నిలువ ఉంచగా.. వాటి నమూనాలను సేకరించారు.

ప్యాకెట్లపై ఎమ్మార్పీ లేకపోవడం, ప్యాకెట్‌పై సూచించిన విధంగా పరిమాణం లేకపోవడం, అల్లం తయారు చేసే మిషనరీ తుప్పు పట్టి ఉండటం, ప్యాకెట్లపై బ్యాచ్‌ నంబర్‌ లేకపోవడంపై అధికారులు ప్రశ్నించారు. సరుకు వివరాల రికార్డులు లేకపోవడంతో మందలించి, పలు రకాల ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు.

పరీక్షల తర్వాత కల్తీ, నాసిరకం పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ సీఐ బుద్దె స్వామి, ఎస్సై సమ్మయ్య,  సిబ్బంది సంపత్‌కుమార్, భాస్కర్‌గౌడ్, సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు