బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు 

28 Dec, 2018 01:09 IST|Sakshi

ముగ్గురు అరెస్టు,  రూ.41 లక్షలు స్వాధీనం 

బెట్టింగ్స్‌ కోసం ప్రత్యేక యాప్‌ తయారు చేసిన బుకీ సుభాష్‌ 

ఒక్కో ఐడీ, పాస్‌వర్డ్స్‌కు  రూ.30 వేలు వసూలు  

సాక్షి,హైదరాబాద్‌: హైటెక్‌ పంథాలో ప్రత్యేక యాప్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్‌ఫోర్స్‌ బృందం రట్టు చేసింది. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం నిర్వహించిన దాడుల్లో ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పోలీసులు రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి కొత్వాల్‌ అంజనీకుమార్‌ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. 

పంటర్‌గా మొదలై బుకీగా..: హిమాయత్‌నగర్‌కు చెందిన వ్యాపారి అలోక్‌ జైన్‌ ముందు పంటర్‌గా పందాలు కాసి నష్టపోయాడు. దీంతో తన సోదరుడు అభిషేక్‌ జైన్, స్నేహితుడు మేహుల్‌ కే మార్జారియాలతో కలి సి బుకీగా మారాడు. చిక్కడపల్లిలో ఓ ఫ్లాట్‌ తీసుకుని బెట్టింగ్స్‌ నిర్వహిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి పందాలు అంగీకరి స్తూ ఆ లెక్కల్ని రికార్డుల్లో నోట్‌ చేసుకునే వారు. మ్యాచ్‌ ముగిశాక పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్‌ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్‌ నిష్పత్తిని సూత్రధారుల నుంచి ఫోన్‌లో తెలుసుకునే వారు. 

యాప్‌ తయారు చేయించిన సుభాష్‌ 
దేశంలోనే ప్రముఖ బుకీగా పేరున్న రాజస్థాన్‌ వాసి సులేమాన్‌ సురానీ అలియాస్‌ సుభాష్‌ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. బెట్టింగ్స్‌ నిర్వహణకు సుభాష్‌ వెబ్‌సైట్, యాప్‌ రూపొందించాడు. వీటిల్లోకి లాగిన్‌ కావాలం టే యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్స్‌ తప్పనిసరి. గత ఐపీఎల్‌లో అలోక్‌ ఇందులో భాగస్వామిగా చేరాడు. అలోక్‌ వద్ద బెట్టింగ్‌కు పాల్పడే పంటర్లకూ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇచ్చేందుకు ఒక్క క్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తూ  కొంత సుభాష్‌కు పంపిస్తున్నాడు. ఆ సైట్, యాప్స్‌లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్‌ వివరాలు, బెట్టింగ్‌ నిష్పత్తి అన్నీ అక్కడే కనిపిస్తాయి. క్రికెట్‌కే కాకుండా ఏ క్రీడకైనా ఈ యాప్‌ ద్వారా పందాలు కాసుకోవచ్చు. 

హవాలా మార్గంలో నగదు లావాదేవీలు  
ఈ యాప్‌లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు హవా లా మార్గంలో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. సమస్యలుంటే వాట్సాప్‌ ద్వారా నే సంప్రదింపులు జరపాలి. అనేక మ్యాచ్‌లకు బెట్టింగ్‌ నిర్వహించిన అలోక్‌ గ్యాంగ్‌ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్త్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు నేతృత్వంలో బృందం దాడి చేసి అలోక్, అభిషేక్, మార్జారియాలను అరెస్టు చేశారు. వీరి  అరెస్టుతో సైట్, యాప్‌లను సుభాష్‌ బ్లాక్‌ చేశాడు. సుభాష్‌పై ఎల్‌ఓసీ జారీ చేయించాలని నిర్ణయించారు.

ఈ అంశాల్లోనే బెట్టింగ్‌.. 
1. టాస్‌ ఏ జట్టు గెలుస్తుంది? 
2. ఫేవరేట్‌ టీమ్‌ ఏది? 
3. ఓ బ్యాట్స్‌మెన్‌ ఎన్ని రన్స్‌ దాటతారు? 
4. ఏ బౌలర్‌ ఎన్ని వికెట్లు తీస్తారు? 
5. మొదటి సెషన్‌లో (6 ఓవర్లు) ఎన్ని రన్స్‌ చేస్తారు? 
6. రెండు, మూడు, నాలుగు సెషన్స్‌లో ఎన్నేసి నమోదవుతాయి?  

>
మరిన్ని వార్తలు