చెల్లెలిపై అకృత్యం.. పొడిచి చంపేశాడు!

1 Jul, 2020 20:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తీహార్‌ జైలులో ఖైదీ హత్య

న్యూఢిల్లీ: తన చెల్లెలిపై అకృత్యానికి పాల్పడి జైలు పాలైన మృగాడిని హతమార్చాడో వ్యక్తి. పక్కా పథకం ప్రకారం తాను సైతం ఖైదీగా మారి ఆరేళ్ల తర్వాత అతడిపై పగ తీర్చుకున్నాడు. ఢిల్లీలోని తీహార్‌ జైలులో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. జకీర్‌(22) అనే వ్యక్తి తన చెల్లెలితో కలిసి ఢిల్లీలోని అంబేద్కర్‌ నగర్‌ ఏరియాలో నివసించేవాడు. ఈ క్రమంలో 2014లో మెహతాబ్‌(28) అనే వ్యక్తి జకీర్‌ చెల్లెలు అయిన మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని అరెస్టు చేసిన పోలీసులు సెక్షన్‌ 376డీ, 328,342,120బీ, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం తీహార్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. (ఆస్తి కోసం శ్రీలంక మహిళ హైడ్రామా!)

ఈ నేపథ్యంలో నిందితుడికి జైలు శిక్ష పడినప్పటికీ ఆ పీడకలను మర్చిపోలేక బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన జకీర్‌.. తన చెల్లెలి చావుకు ఎలాగైనా బదులు తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో ఓ హత్య కేసులో అరెస్టై తీహార్‌ జైలుకు వెళ్లాడు. జైలు నంబరు 8లో మహతాబ్‌ ఉన్నాడని తెలుసుకున్న జకీర్‌ అతడిని అంతమొందించేందుకు పథకం రచించాడు. తన తోటి ఖైదీలు ఇబ్బంది పెడతున్నారని.. తనను నంబరు 4 నుంచి మార్చాలని పోలీసులను వేడుకున్నాడు. (నీళ్ల కోసం వెళ్తే చిత‌క్కొట్టి చంపేశారు)

ఇందుకు సంబంధించిన ప్రక్రియ ముగిసిన అనంతరం అతడు అనుకున్నట్లుగానే మహతాబ్‌ ఉండే నంబరు 8కి షిఫ్ట్‌ అయ్యాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో మహతాబ్‌ను సార్లు కసితీరా పొడిచి చంపేశాడు.  ఈ విషయం గురించి జైలు అధికారులు మాట్లాడుతూ.. ‘‘జూన్‌ 29న ఉదయం ప్రార్థనా సమయంలో మిగతా ఖైదీలు బయటకు వచ్చిన తర్వాత.. మహతాబ్‌ ఉన్న ఫ్లోర్‌కు వెళ్లిన జకీర్‌ కత్తి లాంటి ఆయుధంతో అతడిని పొడిచాడు. అతడిని డీడీయూ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పగ తీర్చుకునేందుకే జకీర్‌ ఇలా చేసినట్లు వెల్లడైంది. అతడిపై సెక్షన్‌ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేశాం’’అని తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా