పోలీసుల తనిఖీలు.. రూ.31.50లక్షలు స్వాధీనం

6 Jun, 2020 13:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ : వన్‌టౌన్ మోడల్ గెస్ట్‌హౌస్ వద్ద శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఓ యువకుడు వెనక్కి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకుడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.31.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయపై ఆదాయపు పన్నుశాఖ, జీఎస్టీ అధికారులకు వన్‌టౌన్‌ పోలీసులు సమాచారం ఇచ్చారు. పట్టుబడ్డ డబ్బు ఓ లారీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందినదని యువకుడు పోలీసులకు తెలిపాడు. (ఏలూరులో ‘లాక్‌డౌన్’‌ దుమారం..)

అదే విధంగా విజయవాడలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన రూ.20లక్షల విలువైన మద్యం పట్టుబడింది. అక్రమ మద్యాన్ని కంకిపాడు మంతిన గ్రామంలోని గడ్డివాములో దాచగా, దీనికి సంబంధించి నలుగురిని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు విజయవాడలో భారీగా గుట్కా, గంజాయి పట్టిబడింది. కృష్ణలంకలో రూ.25లక్షల విలువైన గుట్కాలు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై ఆరుగురు అరెస్టు చేసి.. రెండు కార్లు, మినీ వ్యాన్‌ను సీజ్‌ చేశారు. (గర్భిణి ఏనుగు మృతి: వెలుగులోకి కొత్త విషయం)

మరిన్ని వార్తలు