గంజాయి ముఠా గుట్టు ర‌ట్టు

5 Jul, 2020 15:26 IST|Sakshi

సాక్షి, విశాఖప‌ట్నం: విశాఖప‌ట్నంలో డ్రగ్స్‌ ముఠా గుట్టును పోలీసులు చేధించారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. టాస్క్‌ఫోర్స్‌, విశాఖ నాల్గ‌వ ప‌ట్ట‌ణ పోలీసులు సాలిగ్రామపురంలో సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాకు పాల్ప‌డుతున్న న‌లుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. వీరిని మానుకొండ స‌త్య‌నారాయ‌ణ‌, మ‌జ్జి అజ‌య్ కుమార్‌, కంది ర‌వికుమార్‌, మ‌నోజ్ స్వ‌రూప్‌లుగా గుర్తించారు. వారి ద‌గ్గ‌ర నుంచి 61 ఎల్‌ఎస్‌డీ, 2.5 గ్రాముల ఎండీఎంఏ, 60 గ్రాముల గంజాయి, 9,500 రూపాయ‌లు స్వాధీనం చేసుకున్నారు. మానుకొండ సత్యనారాయణ గతంలోనూ విశాఖ రేవ్‌ పార్టీలో పట్టుబడ్డ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. నిందితుల‌పై 21(బి), 27(ఎ), 20(బి) ఎన్డీపీఎస్(నార్కొటిక్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రోపిక్ స‌బ్‌స్టాన్సెస్‌) చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. (వైరల్‌ : జడ్జీ కళ్ల ముందే గంజా సిగరెట్‌ తాగాడు)

చ‌దివింది డిగ్రీ.. డ‌బ్బు కోసం అడ్డ‌దారులు
గుంటూరు: గుంటూరులో గంజాయి మాఫియా గుట్టురట్టైంది. లిక్విడ్‌ రూపంలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో 8 మంది నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరంద‌రూ డిగ్రీ పూర్తి చేసిన వారే కాగా సులువుగా డ‌బ్బు సంపాదించడం కోసం అడ్డ‌దారుల బాట ప‌ట్టారు. వీరి ద‌గ్గ‌ర నుంచి 8 కేజీల గంజాయి, 30 వేల రూపాయ‌ల నగదు స్వాధీనం చేసుకున్నారు. (‘నాకూ గంజాయి అలవాటు ఉండేది’)

మరిన్ని వార్తలు