దారుణం; తల,మొండెం వేరు చేసి..

13 May, 2019 18:23 IST|Sakshi
శ్రీమతి శెట్టి(ఫైల్‌ ఫొటో:కర్టెసీ ఇండియాటుడే)

బెంగళూరు : కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. మధ్య వయస్సు గల ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. శ్రీమతి శెట్టి అనే వివాహిత భర్తకు విడాకులిచ్చి ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు. అనంతరం ముక్కలుగా నరికి తల, మొండెం వేరు చేశారు. శరీర భాగాలను రెండు సంచులలో ప్యాక్‌ చేసి మొండాన్ని నందిగూడలో, తలను నంటూర్‌ హైవే సమీపంలో పడేశారు. సమాచారం అందుకున్ను పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మృతురాలిపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. శ్రీమతి శెట్టి పండేశ్వర్‌లో ఎలక్ట్రికల్‌ షాపు నిర్వహిస్తోంది. భర్త సుదీప్‌తో విడాకులు తీసుకున్న అనంతరం ఆమె ఒంటరిగా ఉంటోంది. అయితే ఈమె హత్యతో సుదీప్‌కు సంబంధం ఉండే అవకాశం లేదని భావిస్తున్నాం. ఎందుకంటే అతడు మొబైల్‌ చోరీ కేసులో మంగళూరు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళూరులోని ఓ షాప్‌ ముందు మనిషి శరీర భాగాలు పడి ఉండటాన్ని యజమాని గమనించాడు. రక్తపు సంచులతో పాటు ఓ హెల్మెట్‌లో మహిళ తల ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి లోతుగా దర్యాప్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు