మిన్నెసోటాలో శ్రీరామనవమి వేడుకలు

30 Mar, 2015 09:43 IST|Sakshi

అమెరికా: 'శ్రీరామ నవమి' మనందరికీ తెలిసిందే. ఇదొక హిందువుల పవిత్ర పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం నవమి రోజున ఈ పండుగను చేస్తారు. ఈ  శ్రీరామ నవమి మహోత్సవాలు శనివారం యూఎస్ఏలోని మిన్నెసోటాలో ఘనంగా జరిగాయి. అక్కడ మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (మాతా) ఆధ్వర్యంలో హిందూ దేవాలయంలో సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి 600 పైగా భక్తులు హాజరయ్యారు.

ఈ వేడుకను ఆలయ పూజారులు ఆరంభించారు. వందలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఆలయ పూజారి మురళి భత్తార్ కన్యదానం, మాంగల్యధారణ, తలంబ్రాల సేవ, అర్చన, ఆరతి ర్యక్రమాలను నిర్వహించారు. మాతా అధ్యక్షుడు సుధాకర్ జపా, ఆయన కుటుంబ సభ్యులు, మాతా బోర్డు సభ్యులు శ్రీరామ దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

వేంకట దేవులపల్లి గ్రూపు అందించిన రామభజన, రామదాసు కీర్తనలతో భక్తులు ఆనందించారు. పూజ తర్వాత ఆర్గనైజర్లు భక్తులకు పానకం(తేనీరు) ప్రసాదించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు, ఆలయ యాజమాన్యానికి, కమిటీ సభ్యులకు మాతా ప్రెసిడెంట్ సుధాకర్ జపా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాతా బోర్డు సభ్యులు జి.మహిందర్, నెల్ల నాగేందర్, అల్లమనేని నిరంజన్, బచ్చిగారి రాజశేఖర్, రవ్వా రమేష్, సాగి రవి, భగవాన్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, కోమకుల రమేష్, కంజుల రాకేష్, కోయాడ పవన్, సక్రు, కపిడి కవిత, మద్దిశెట్టి శివాని, పట్టూరి యుగేందర్, తాళ్ల సారథి, బుచ్చిరెడ్డి, సురేష్, శ్రీపాద దేవరాజు, ఆదిత్య, కాదర్ల అనుష్క, గూనుగంటి అశ్విని, కూర మాలతి, భవాని చేపూరి, కౌకోటి రాజ్, చిన్నోల అమర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు