క్రికెట్ టోర్నీలో సత్తాచాటిన కొడిమ్యాల వెల్ విషర్స్

10 Aug, 2017 17:51 IST|Sakshi
క్రికెట్ టోర్నీలో సత్తాచాటిన కొడిమ్యాల వెల్ విషర్స్

సాక్షి, సింగపూర్‌ :
తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని వుడ్ లాండ్స్ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ 2017 జరిగింది. ఈ టోర్నీలో కొడిమ్యాల వెల్ విషర్స్ జట్టు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభకనభరిచి విజేతగా నిలిచింది. ఈ ఏడాది క్రికెట్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొన్నాయి. లీగ్స్లో గ్రూప్ “ఏ” లో తెలుగు రైడర్స్, స్వేచ్ఛా టీం, స్కై టీం, గ్రూప్ “బి” లో భాగ్యనగర్ రైడర్స్, 11 స్టార్స్, ఇండియన్ రోలర్స్, గ్రూప్ ‘సి’ లో ముత్యంపేట్ కింగ్స్, జగిత్యాల్ టైగర్స్, తెలంగాణ లెజెండ్స్, గ్రూప్ ‘డి’ లో కొడిమ్యాల వెల్ విషర్స్, క్రిక్ బుల్స్, రాయల్ స్టార్స్ తలపడ్డాయి. లీగ్స్ అనంతరం స్వేచ్ఛా టీం , కొడిమ్యాల వెల్ విషర్స్, జగిత్యాల్ టైగర్స్, ఇండియన్ రోలర్స్ సెమీఫైనల్కు చేరుకున్నాయి. జగిత్యాల్ టైగర్స్, కొడిమ్యాల వెల్ విషర్స్ మధ్య జరిగిన ఫైనల్‌ పోరులో కొడిమ్యాల వెల్ విషర్స్ విజేతగా నిలిచింది. టోర్నమెంట్ బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కూడా కొడిమ్యాల వెల్ విషర్స్ టీం చెందిన ఆటగాళ్లు గెలుచుకున్నారు.
 
ఈ టోర్నమెంట్కు సమన్వయకర్తలుగా ప్రాంతీయ కార్యదర్శి అలసాని క్రిష్ణా రెడ్డి, చిల్క సురేశ్, ఆర్సిరెడ్డి, చెట్టిపల్లి మహేశ్, దామోదర్ గోపగోని, జుట్టు ఉమేందర్, బైరి రవి, పిల్లి రంజిత్లు వ్యవహరించారు. సొసైటి సభ్యలు మాట్లాడుతూ.. సింగపూర్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించడానికి వివిధ పండుగలను జరుపుకోవడమే కాకుండా క్రీడాస్పూర్తిని పెంపొందించడానికి క్రికెట్, బ్యాడ్మింటన్వంటి ఆటల పోటీలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని జట్ల క్రీడాస్పూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను సొసైటి  ఉపాధ్యక్షులు పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీనివాస్,  నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ కుమార్ రెడ్డి,  కార్యవర్గ  సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, పెరుకు శివరామ్ ప్రసాద్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ విజయవంతం కావడానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా చిట్ల విక్రమ్, గొనె నరేందర్, గండ్ర సునీల్ కుమార్, దీరజ్ గౌడ్ కు సొసైటి కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు