13 లారీల సీజ్‌

3 Jan, 2017 23:36 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : నిబంధనలకు విరుద్ధంగా, అధిక టన్నేజీతో వెళుతున్న 13 లారీలను సీజ్‌ చేసినట్లు విజిలెన్స్‌ ఎస్పీ అనిల్‌బాబు తెలిపారు. మంగళశారం కంబదూరు పరిసర ప్రాంతాలో తనిఖీలు చేపట్టామన్నారు. అధిక టన్నేజితో ఐరన్‌ ఓర్‌ పిల్లెట్స్‌ను బళ్లారి నుంచి హిందూపురం మీదుగా గౌరీబిదనూరు, బెంగుళూరుకు అక్రమంగా రవాణా చేస్తూ ఈ వాహనాలు పట్టుబడినట్లు తెలిపారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు