ఆ స్థలం మాదే

26 Dec, 2016 23:14 IST|Sakshi
  • అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి 
  • ప్రభుత్వ సేకరణకు మేము ఇవ్వలేదు
  • వారు ఇచ్చిన అవార్డుతో సంబంధంలేదు
  • నగరపాలక సంస్థ అడగలేదు.. పన్ను కట్టలేదు
  • సర్వే నం.370తో కందుల కుటుంబానికి సంబంధంలేదు
  • హోలీఏజెంల్స్‌ స్కూల్‌ స్థలం మాదే..
  • విలేకర్లతో సత్యవోలు శేషగిరిరావు
  • డాక్యుమెంట్లు చూపించని వైనం
  • ఆదెమ్మదిబ్బ స్థలంపై కొనసాగుతున్న సందిగ్ధత
  • సాక్షి, రాజమహేంద్రవరం : 
    ఆదెమ్మదిబ్బ స్థలం తమదేనని సత్యవోలు శేషగిరిరావు అనే వ్యక్తి అంటున్నారు. తమ తండ్రి సత్యవోలు పాపారావుకు నలుగురు అన్నదమ్ములమని, తాను రెండోవాడినని చెబుతున్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో సత్యవోలు శేషగిరిరావు పేరుతో ఉన్న వ్యక్తి మాట్లాడారు. తాను సత్యవోలు శేషగిరిరావునంటూ 2008లో తీసుకున్న ఓటర్‌ గుర్తింపు కార్డును చూపారు. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగిగా విద్యుత్‌ శాఖలో పని చేసి పదవీ విరమణ చేశానని చెప్పారు. తన తండ్రి సత్యవోలు పాపారావు 2008లో మరణించారని, చట్టపరమైన హక్కులకు తమ వద్ద ఆధారాలున్నాయంటున్నారు. తమకు నగరంలో అనేక స్థలాలు ఉన్నాయని, వాటిలో చాలా వరకు ఎక్కడ ఉన్నాయో తెలియదని చెప్పారు. ఆదెమ్మదిబ్బ ప్రాంతంలో సర్వే నంబర్‌ 730లో తమ కుటుంబానికి 4.19 ఎకరాలు ఉందని చెప్పారు. తన తండ్రి సత్యవోలు పాపారావు, ఆయన తమ్ముడు లింగమూర్తి 2.23, 1.96 ఎకరాల చొప్పున పంచుకున్నామన్నారు. సత్యవోలు పాపారావు రెండో కుమారుడైన తాను ఈ స్థలం అభివృద్ధి చేయాలని, అక్కడ ఆక్రమణదారులను ఖాళీ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం తమ స్థలం 3 ఎకరాల 30,222 చదరపు అడుగులు సేకరించినా అందుకు సంబంధించిన అవార్డు తమకు అందలేదన్నారు. 1984లో ప్రభుత్వం వద్ద నగదు లేక కోర్టులో చెల్లించలేదని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి కోర్టులో ప్రభుత్వం అవార్డు చెల్లించినట్లు పత్రాలున్నా వాటితో మాకు సంబంధంలేదని చెబుతున్నారు. మా అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం స్థలం తీసుకుని అవార్డు ప్రకటించిందని చెప్పారు. మరోసారి ప్రభుత్వం తమ పినతండ్రికి చెందిన 1.96 ఎకరాలు సేకరించిన దాంట్లో తమది లేదన్నారు. ప్రభుత్వం అవార్డును ఉపసంహరించుకుందని చెబుతున్నారు. తమ స్థలానికి సంబంధించిన సరిహద్దులు, ఎవరిపేరుపై రిజిస్ట్రేష¯ŒS జరిందన్న వివరాలతో కూడిన డాక్యుమెంట్లు ఉన్నాయంటున్నారు. బ్రహ్మణలు ఉన్న స్థలం తమదేనని, తన పినతండ్రికి కుమారులకు సంబంధం లేదన్నారు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పారు. ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ, సబ్‌కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్, తహసీల్దార్‌ కె.పోసయ్యSకు చూపించామంటున్నారు.
    పన్ను కట్టమని అడగలేదు.. 
    నగరపాకల సంస్థ నోటీసులు ఇవ్వలేదు కాబట్టే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖాళీ స్థలం పన్ను కట్టలేదని చెబుతున్నారు. ప్రభుత్వం అడగందే ఎలా చెల్లిస్తామని ప్రశ్నిం చారు. హోలీ ఏంజెల్స్‌ స్కూల్‌ ఉన్న స్థలం కూడా తమదేనని, నకిలీ సర్వే నంబర్‌తో దాన్ని ఆక్రమించారన్నారు. కందుల కుటుంబానికి సర్వే నంబర్‌ 730లో ఎలాంటి స్థలం లేదన్నారు. అక్కడ పేదలకు గుర్తింపుకార్డులు, విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంపై నగరపాకల సంస్థ కమిషనర్‌కు మూడు నెలల కిందట నోటీసులు ఇచ్చామని తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లు తొలగించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ, డీఈ, ఏఈలకు వినతిపత్రాలు ఇచ్చామని చెప్పారు. 370 సర్వే నంబర్‌లో ఇళ్లు కట్టుకుని సర్వే నంబర్‌ 725/3ఏ పేరుతో కొంతమంది రిజిస్ట్రేష¯ŒS చేయించుకున్నారని, దీనిపై తాజాగా సర్వే చేయిస్తున్నామని చెప్పారు. కాగా, స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, అవి విలేకర్లందరికీ ఇస్తామని చెప్పిన సత్యవోలు శేషగిరిరా వు చివరకు అవి ఏమీ ఇవ్వకుండానే సమావేశం ముగించా రు. దీంతో ఆ స్థలంపై సందిగ్ధత కొనసాగుతోంది.
     
మరిన్ని వార్తలు