‘అంత్య’ ఘట్టాన ఆనందపారవశ్యం

1 Aug, 2016 20:21 IST|Sakshi
‘అంత్య’ ఘట్టాన ఆనందపారవశ్యం
కొవ్వూరు : కొవ్వూరు గోష్పాదక్షేత్రం ఘాట్‌లో రెండోరోజు భక్తుల రద్దీ పెరిగింది. సుమారు 25 వేలమంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన పిండప్రదాన షెడ్లు చాలకపోవడంతో చాలామంది ఆరుబయటే పుణ్యకార్యాలు నిర్వహించారు.  సుందరేశ్వరస్వామి ఆలయం వద్ద ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. కొవ్వూరు మండలంలోని చిడిపి, కుమారదేవం, ఆరికిరేవుల, వాడపల్లి, మద్దూరు పుష్కఘాట్లలో స్థానికులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఈ ప్రాంతాల్లో  సుమారు రెండువేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా.  తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక, తాడిపూడి ఘాట్లూ భక్తులతో కిక్కిరిశాయి. ఈ మండలంలో సుమారు ఐదువేల మంది స్నానాలు ఆచరించినట్టు అధికారులు చెప్పారు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌లో సోమవారం 50,725 మంది స్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. పెనుగొండ డివిజన్‌లో 10,800 మంది, నిడదవోలులో 2,225 మంది, పెరవలి మండలంలో 12,200 మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. 
 
 
 
మరిన్ని వార్తలు