టెన్త్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు

3 Apr, 2017 00:29 IST|Sakshi
 - నేటి నుంచి 16 వరకు మూల్యాంకనం
- స్పాట్‌ అధికారులతో డీఈఓ సమావేశం
 
కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్‌ వాల్యుయేషన్‌ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల17వ తేదీన మొదలైన పరీక్షలు 30తో ముగిశాయి. ఈ క్రమంలో వెంటనే స్పాట్‌ వాల్యుయేషన్‌  మొదలెట్టి వీలైనంత తొందరగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటీకే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్కూల్‌ విద్యార్థులకు సవరణాత్మకమైన బోధన జరుగుతోంది. ఇందుకు ఇబ్బందులు లేకుండా స్పాట్‌కు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదే అంశంపై ఆదివారం డీఈఓ తాహెరా సుల్తానా తన ఛాంబర్‌లో స్పాట్‌  అధికారులతో సమావేశమయ్యారు. మూల్యాంకనానికి మొత్తం 1987 మందిని నియమించామని తెలిపారు. 19 మంది ఏసీఓలు, 236 మంది సీఈలు, 1651 మంది ఏఈలు,  336 మంది స్పెషల్‌ అసిస్టెంట్లు  పని చేస్తారన్నారు. ముల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పగద్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెమ్యునరేషన్‌ ఇస్తామన్నారు. ఈనెల16వ తేదీ వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఓంకార్‌ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు