అసెంబ్లీని ముట్టడిస్తాము

14 Sep, 2016 01:26 IST|Sakshi
అసెంబ్లీని ముట్టడిస్తాము
 
వినాయక్‌నగర్‌ :
స్టూడెంట్‌ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రదీప్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లీలోగల నీలం రాంచంద్రయ్య భవన్‌లో మంగళవా రం పీడీఎస్‌యూ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మెస్‌ చార్జీలను రూ. 2,500 అందించాలని, కాస్మొటిక్‌ చార్జీలకోసం రూ. 500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో రెగ్యులర్‌ వార్డెన్‌లను, వర్కర్లలను నియమించాలని కోరారు. ఈ డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఆజాద్, ప్రధాన కార్యదర్శి సుమన్, ఉపాధ్యక్షులు రాజు, కల్పన, సహాయ కార్యదర్శులు జైత్రాం, స్వేచ్ఛ, నాయకులు ప్రశాంత్, నరేందర్, సుజిత్, ఉదయ్, సంతోష్, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు