బీసీ హాస్టళ్లల్లో బయోమెట్రిక్‌

19 Oct, 2016 01:10 IST|Sakshi
బీసీ హాస్టళ్లల్లో బయోమెట్రిక్‌
లేపాక్షి: రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లు, బీసీ కళాశాల హాస్టళ్లలో త్వరలో బయోమెట్రి క్‌ విధానం అమలు చేస్తున్నట్లు అనంతపురం బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రమాభార్గవి తెలి పారు. మంగళవారం మధ్యాహ్నం లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బీసీ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తున్నామన్నారు. అధికారులకు ఈ విధానంపై త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనివల్ల వారిలో జవాబుదారీతనం, విద్యార్థుల్లో హాజరు శాతం మెరుగు పడుతుందన్నారు. ఆమె వెంట ఏబీసీడబ్ల్యూఓ కృత్తిక, హాస్టల్‌ సంక్షేమాధికారి సుభాషిణి ఉన్నారు. 
మరిన్ని వార్తలు