హోరాహోరీగా సెంట్రల్‌జోన్‌ ‘గ్రిగ్‌’

1 Feb, 2017 22:32 IST|Sakshi
హోరాహోరీగా సెంట్రల్‌జోన్‌ ‘గ్రిగ్‌’
13 జోన్ల పరిధిలోని 516 మంది విద్యార్థులు హాజరు
నేడు బహుమతుల ప్రదానోత్సవం
తుని (తుని) : పట్టణంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభమైన సెంట్రల్‌ జోన్‌ బాలికల గ్రిగ్‌ పోటీలు బుధవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాలోని 13జోన్ల పరిధిలో 46 పాఠశాలలకు చెందిన 516 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 15 క్రీడల్లో పోటీలు జరగాల్సి ఉండగా 11 క్రీడల పోటీలు నిర్వహించారు. మిగిలినవి గురువారం నిర్వహిస్తామని హెచ్‌ఎం నూకరత్నం తెలిపారు. పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఈసందర్భంగా పోటీల విజేతల వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో పీడీ కుమారి, కె.సత్యనారాయణ, ఆంజనేయప్రసాద్‌ పాల్గొన్నారు.   
క్రీడల్లోని విజేతలు వీరే..
బాస్కెట్‌ బాల్‌లో ఓబీఎస్‌ఎమ్‌హెచ్‌ స్కూల్‌ (పిఠాపురం జోన్‌) విన్నర్స్‌గానూ,  ఏపీఎస్పీ క్వార్టర్స్‌ జెడ్పీఈహెచ్‌ స్కూల్‌ (కాకినాడ జో¯ŒS) విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. కబడ్డీలో డీఎంహెచ్‌ స్కూల్‌(రాజమండ్రి) విన్నర్స్‌గానూ, జెడ్పీహెచ్‌ స్కూల్‌ (తుని పి.కొట్టాం)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. వాలీబాల్‌లో జి.మామిడాడ జెడ్పీ హెచ్‌ స్కూల్‌(అన పర్తి జోన్‌) విన్నర్స్‌గానూ, అంతర్వేది జెడ్పీహెచ్‌ స్కూల్‌ (రాజోలు జోన్‌)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు.బ్యాడ్మింటన్‌లో బిక్కవోలు జెడ్పీహెచ్‌ స్కూల్‌ (అనపర్తి జోన్‌) విన్నర్స్‌ స్థానం, కొత్తపేట జెడ్పీ హెచ్‌స్కూల్‌ (కొత్తపేట జోన్‌) విద్యార్థులు రన్నర్స్‌ స్థానంలో నిలిచారు. హ్యాండ్‌బాల్‌లో ఎ.కొత్తపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ (తునిజోన్‌) మొదటి స్థానం, పెదపురప్పాడు జెడ్పీహెచ్‌ స్కూల్‌ (రామచంద్రాపురం జోన్‌) విద్యార్థులు రెండో స్థానం సంపాదించుకున్నారు. త్రోబాల్‌లో బి.వేమవరం జెడ్పీహెచ్‌ స్కూల్‌ (రామచంద్రాపురం జోన్‌) విన్నర్స్‌గానూ, తుని లయోలా ఈ.ఎం.హెచ్‌.స్కూల్‌ (తునిజోన్‌)విద్యార్థులు రన్నర్స్‌గా నిలిచారు. షటిల్‌ సింగిల్స్‌ విభాగంలో ఆదిత్యా పబ్లిక్‌ స్కూల్‌ (అమలాపురంజోన్‌) వినర్స్‌గానూ జి.మామిడాడ జెడ్పీహెచ్‌ స్కూల్‌ (అనపర్తి జోన్‌) రన్నర్స్‌గా నిలిచారు. డబుల్స్‌లో ఆదిత్యా పబ్లిక్‌ స్కూల్‌ (అమలాపురంజోన్‌) వినర్స్‌గానూ, కొండెవరం జెడ్పీహెచ్‌ స్కూల్‌ (పిఠాపురం జోన్‌) రన్నర్స్‌గా నిలిచారు. టేబుల్‌టెన్నిస్‌ సింగిల్స్‌లో బిక్కవోలు జెడ్పీహెచ్‌ స్కూల్‌ (అనపర్తి జోన్‌) విన్నర్స్‌ గానూ, కొండెవరం జెడ్పీహెచ్‌ స్కూల్‌(పిఠాపురం జోన్‌) రన్నర్స్‌గానూ నిలిచా రు. డబుల్స్‌ విభాగంలో జీహెచ్‌ స్కూల్‌ (మండపేట జోన్‌) విన్నర్స్‌గానూ, కొండెవరం జెడ్పీహెచ్‌ స్కూల్‌ (పిఠాపురం జోన్‌) రన్నర్‌గా నిలిచారు. టెన్నికాయిట్‌లో తేటగుంట జెడ్పీ హెచ్‌.స్కూల్‌ (తునిజోన్‌) విన్నర్స్‌గానూ, అనపర్తి జీబీఆర్‌హెచ్‌ స్కూల్‌ (అనపర్తి జోన్‌) రన్నర్స్‌గా నిలిచారు. చెస్‌లో మంజేరు జెడ్పీ హెచ్‌.స్కూల్‌ (రామచంద్రాపురం జోన్‌) విన్నర్స్‌గానూ, అనపర్తి జీబీఆర్‌హెచ్‌ స్కూల్‌(అనపర్తి జోన్‌) రన్నర్స్‌గా నిలిచారు. 
నేడు బహుమతుల ప్రదానోత్సవం
సెంట్రల్‌జోన్‌ గ్రిగ్‌ పోటీల్లో మిగిలిన క్రీడల పూర్తయిన అనంతరం తుని పట్టణ బాలికోన్నత పాఠశాలలో క్రీడల్లోని విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుందని హెచ్‌ఎం నూకరత్నం తెలిపారు. ఈకార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు.  
 
>
మరిన్ని వార్తలు